ETV Bharat / bharat

కశ్మీర్​లో రాజకీయ నేతలు సహా 100 మంది అరెస్ట్​ - రాజకీయ నేతలు

జమ్ముకశ్మీర్​కు​ ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370, 35ఏ రద్దు చేసిన నేపథ్యంలో అక్కడ భద్రత కట్టుదిట్టం చేసింది ప్రభుత్వం. అంతర్జాల, మొబైల్​ సేవలను నిలిపేస్తూ పలు ఆంక్షలు విధించింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తారనే అనుమానాలతో ఇప్పటివరకు 100 మందికిపైగా అరెస్ట్​ చేసినట్లు అధికారులు తెలిపారు.

కశ్మీర్​లో రాజకీయ నేతలు సహా 100 మంది అరెస్ట్​
author img

By

Published : Aug 7, 2019, 2:59 PM IST

కశ్మీర్​లో రాజకీయ నేతలు సహా 100 మంది అరెస్ట్​
అధికరణ 370, 35ఏ రద్దుతో జమ్ముకశ్మీర్​లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతర్జాల, మొబైల్​ సేవలను నిలిపేసి పలు ఆంక్షలు విధించిన క్రమంలో ఇప్పటి వరకు సుమారు 100 మందిని అరెస్ట్​ చేశాయి భద్రతా సంస్థలు. అందులో ప్రముఖ రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలూ ఉన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తారనే అనుమానంతోనే వారిని అదుపులోకి తీసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

ప్రముఖులు...

ఆదివారం రాత్రి నుంచి గృహ నిర్బంధంలో ఉన్న జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్​ అబ్దుల్లాను సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. జమ్ముకశ్మీర్​ పీపుల్స్​ కాన్ఫరెన్స్​ నాయకుడు సజ్జద్​ లోన్​, ఇమ్రాన్ అన్సారీలను అరెస్ట్​ చేశామని చెప్పారు.
అరెస్ట్​ చేసిన నాయకులను వారికి ఇళ్లకు దగ్గర్లోని హరి నివాస్​కు తరలించారు.

అదుపులోనే పరిస్థితులు..

చెదురుమదురు రాళ్ల దాడులు మినహా జమ్ముకశ్మీర్​లోని మూడు ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణం ఉందని అధికారులు తెలిపారు. ద్విచక్రవాహనాలు, కార్లు సహా కాలినడకన ప్రజలు రోడ్లపైకి వస్తున్నట్లు చెప్పారు. శుభకార్యాలు ఉన్న ఇళ్లల్లో ప్రజలకు భద్రత దళాలు రక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పూంచ్​ జిల్లా బల్ఫయిజ్​ ప్రాంతంలో జరిగిన రాళ్ల దాడుల్లో జవాన్లకు స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు.

ఇదీ చూడండి: ఆపరేషన్​ కశ్మీర్​పై ఐక్యరాజ్యసమితి మౌనం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.