తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మక్కల్ నీది మయ్యమ్ పార్టీ సమావేశమైంది. కమల్‌హాసన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా స్థాయి కార్యదర్శులు పాల్గొన్నారు. ఎన్నికల్లో పార్టీ విధివిధానాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
తమ కూటమి ప్రజలతోనే ఉంటుందని సమావేశం అనంతరం పార్టీ స్పష్టం చేసింది. విజయం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని కార్యకర్తలకు సూచించింది.
తమిళనాడు అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలైన డీఎంకే, ఎండీఎంకే మధ్యే పోటీ నెలకొనే అవకాశం ఉంది.