త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవికి.. విపక్షాలన్నీ కలిసి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ మేరకు ఇతర పక్షాలతో సంప్రదింపులు జరుపుతామని తెలిపింది. ప్రస్తుత రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది.
సెప్టెంబర్ 14న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అదే రోజు రాజ్యసభ నూతన డిప్యూటీ ఛైర్మన్‌ను ఎన్నుకుంటారు.
అస్త్రశస్త్రాలు సిద్ధం!
పార్లమెంటులో లేవనెత్తాల్సిన అంశాలపైనా కాంగ్రెస్ చర్చించింది. కరోనా నియంత్రణ అంశంలో ప్రభుత్వం విఫలమైందని.. కేసుల సంఖ్యలో బ్రెజిల్‌ను దాటి ప్రపంచంలో రెండోస్థానానికి చేరిందన్న విషయాన్ని సభ దృష్టికి తీసుకురావాలని నిర్ణయించింది. చైనాతో ఉద్రిక్తతల వ్యవహారాన్ని ఉభయ సభల్లోనూ లేవనెత్తాలని తీర్మానించింది.
ఇదీ చూడండి:- ప్రశ్నోత్తరాలే ప్రజాస్వామ్యానికి ఊపిరి