ETV Bharat / bharat

ఆ బిల్లులను తిప్పి పంపాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి

వ్యవసాయ బిల్లులను ఆమోదించకుండా, తిప్పి పంపాలని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ను కోరాయి విపక్షాలు. ఆ బిల్లులు రాజ్యాంగ విరుద్ధంగా పార్లమెంటు ఆమోదం పొందాయని ఆరోపించాయి.

Opposition parties request President Kovind not to give assent to contentious farm bills
ఆ బిల్లులను తిప్పి పంపాలని రాష్ట్రపతిని కోరిన విపక్షాలు
author img

By

Published : Sep 23, 2020, 6:53 PM IST

వ్యవసాయ బిల్లులు పార్లమెంటులో రాజ్యాంగానికి విరుద్ధంగా ఆమోదం పొందాయని పేర్కొంటూ.. వాటిని తిప్పి పంపాలని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ను కోరారు విపక్ష నేతలు. బిల్లులను ఆమోదిస్తూ సంతకం చేయొద్దని కోరారు.

రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్​ నేతృత్వంలోని విపక్ష సభ్యుల బృందం రాష్ట్రపతిని కలిసి ఈమేరకు విజ్ఞాపన పత్రం అందజేసింది. బిల్లుల ఆమోదానికి ముందు అన్ని పార్టీలు, రైతు సంఘాలతో ప్రభుత్వం చర్చించాల్సిందని అన్నారు ఆజాద్​.

విపక్షాల ఆందోళనల నడుమ రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు-2020, రైతుల సాధికారత, రక్షణ, వ్యవసాయ సేవల బిల్లు- 2020ను పార్లమెంటు ఆమోదించింది. రాజ్యసభలో బిల్లు ఆమోదం సమయంలో ఎనిమిది మంది సభ్యులు అనుచితంగా ప్రవర్తించారని... వారిపై సస్పెన్షన్ వేటు వేశారు ఛైర్మన్​. ఈ చర్యను ఖండించిన విపక్షాలు పార్లమెంటు సమావేశాలను మంగళవారం బహిష్కరించాయి.

ఇదీ చూడండి: టాపర్లకు కార్లు బహుమతిగా ఇచ్చిన మంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.