కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుల ఆమోదానికి నిరసనగా విపక్ష పార్టీలు పార్లమెంట్ కాంప్లెక్స్‌లో నిశబ్ద ర్యాలీ నిర్వహించాయి. 'రైతులను, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి' అనే ప్లకార్డులు చేతబట్టి ఎంపీలు నిరసనలో పాల్గొన్నారు.
పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ చేపట్టారు. ర్యాలీకి ముందు మహాత్ముడి విగ్రహం వద్ద నిల్చొని నిరసన వ్యక్తం చేశారు.
"మోదీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా పార్లమెంట్ రబ్బర్ స్టాంప్ వేయించిన రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక బిల్లులకు నిరసనగా మహాత్మా గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేస్తున్నాం. కాంగ్రెస్‌తో పాటు భావసారూప్యత కలిగిన పార్టీలు ఇందులో పాల్గొన్నాయి."
-జైరాం రమేశ్, రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ విప్
కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ-ఎం, డీఎంకే, ఆర్జేడీ, ఆప్, ఎన్సీపీ, తెరాస, సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
అంతకుముందు విపక్ష నేతలందరూ కలిసి లోక్‌సభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ ఛాంబర్లో సమావేశమయ్యారు. బిల్లులకు వ్యతిరేకంగా తదుపరి కార్యచరణపై చర్చించారు.
ఇవీ చదవండి