ETV Bharat / bharat

22 లక్షల మందిని స్వస్థలాలకు చేర్చిన 'శ్రామిక్'​ రైళ్లు - RAIL-LOCKDOWN-TRAINS-TALLY

మే 1 నుంచి దేశవ్యాప్తంగా నడిపిన ప్రత్యేక రైళ్ల వివరాలను వెల్లడించింది రైల్వేశాఖ. ఇప్పటివరకు 1,813 శ్రామిక్​ రైళ్లులో 22 లక్షల మంది వలసకూలీలను స్వస్థలాలకు చేర్చినట్లు స్పష్టం చేసింది.

RAIL-LOCKDOWN-TRAINS-TALLY
22 లక్షల మందిని స్వస్థలాలకు చేర్చిన 'శ్రామిక్'​ రైళ్లు
author img

By

Published : May 20, 2020, 9:58 PM IST

Updated : May 20, 2020, 10:39 PM IST

దేశవ్యాప్తంగా మే 1 నుంచి 20 వరకు.. 1,813 శ్రామిక్​ రైళ్లను నడిపినట్లు స్పష్టం చేసింది రైల్వేశాఖ. వీటిలో 301 రైళ్లు మార్గ మధ్యలో ఉండగా.. 1,512 రైళ్లు గమ్యస్థానాలకు చేరుకున్నట్లు తెలిపింది. ప్రత్యేక రైళ్ల ద్వారా ఇప్పటివరకు 22 లక్షల మంది వలస కూలీలను స్వస్థలాలకు చేర్చినట్లు తెలిపారు అధికారులు.

ఉత్తరప్రదేశ్​కు అత్యధికంగా 912 సర్వీసులు నడపగా.. బీహార్​కు 398 రైళ్ల సేవలతో రెండో స్థానంలో నిలిచింది. గుజరాత్​ నుంచి 583 రైళ్లు, మహారాష్ట్ర నుంచి 320 రైళ్లు.. ఇతర రాష్ట్రాలకు ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. మే 19న దేశవ్యాప్తంగా 204 ప్రత్యేక రైళ్లను నడిపినట్లు.. రైల్వేశాఖ మంత్రి పియూష్​ గోయెల్​ వెల్లడించారు.

Last Updated : May 20, 2020, 10:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.