ETV Bharat / bharat

సొంతగూటికి 20 లక్షల మంది వలస కూలీలు

మే 1 నుంచి ఇప్పటి వరకు శ్రామిక్ ప్రత్యేక రైళ్లలో 20 లక్షల మంది వలసకూలీలను గమ్యస్థానాలకు చేర్చామని భారతీయ రైల్వే ప్రకటించింది. ఇకపై మరిన్ని రైళ్లను కూడా నడుపుతామని స్పష్టం చేసింది. ఇకపై శ్రామిక్ ప్రత్యేక రైళ్లను వివిధ స్టేషన్లలో ఆపే విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరం లేదని ప్రకటించింది.

author img

By

Published : May 19, 2020, 5:37 PM IST

Operated 1,565 'Shramik Special' trains, ferried over 20 lakh migrants: Railways
వలసకూలీలను గమ్యస్థానాలకు చేర్చిన రైల్వే

భారతీయ రైల్వే మే 1 నుంచి 1,565 శ్రామిక్ ప్రత్యేక రైళ్లను నడిపి, 20 లక్షల మంది వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చినట్లు రైల్వేమంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు. మరో 116 రైళ్లు వలస కూలీలను గమ్యస్థానాలకు చేర్చడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు.

పరిమితి పెంపు...

శ్రామిక్ ప్రత్యేక రైళ్లలో అంతకుముందు నిర్దేశించిన 1200 మంది ప్రయాణికుల పరిమితిని 1700 మందికి పెంచుతూ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే మొదట్లో ప్రారంభ స్థానం నుంచి గమ్యస్థానం వెళ్లే వరకు మధ్యలో ఎక్కడా రైళ్లు ఆపేందుకు అనుమతించలేదు. కానీ ఇప్పుడు మూడు చోట్ల రైలు ఆగేందుకు రైల్వే శాఖ అనుమతి ఇచ్చింది.

రాష్ట్రాల అనుమతి అవసరం లేదు..

శ్రామిక్ ప్రత్యేక రైళ్లను వివిధ స్టేషన్లలో ఆపే విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరం లేదని భారతీయ రైల్వే తెలిపింది.

ఇంతకుముందు ఈ విషయంలో పెద్ద రాజకీయ వివాదమే చెలరేగింది. వలసకూలీలను తీసుకొచ్చే శ్రామిక్ రైళ్లకు బంగాల్, ఝార్ఖండ్, ఛత్తీస్​గఢ్ ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడం లేదని రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: స్వచ్ఛ రేటింగ్​: విజయవాడ, తిరుపతికి 3 స్టార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.