ETV Bharat / bharat

వ్యాక్సిన్ సమగ్ర సమాచారం కోసం డిజిటల్ ప్లాట్​ఫామ్​

author img

By

Published : Oct 7, 2020, 5:42 AM IST

భారత్​లో కొవిడ్-19 వ్యాక్సిన్​ను ​అభివృద్ధి చేస్తున్న సంస్థలు, వాటి వివరాలు, వ్యాక్సిన్​ నిల్వలు తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు సరికొత్త డిజిటల్​ ప్లాట్​ఫామ్​ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్​ భూషణ్ తెలిపారు. దీనికి తోడు వ్యాక్సిన్​ను ప్రజలకు ఎలా ఇవ్వాలో ఆన్​లైన్​ద్వారా సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

Online platform to track COVID-19 vaccination, training modules for vaccinators in the works
కొవిడ్​-19వ్యాక్సిన్​ సమాచారం కోసం ఈ-విన్​ డిజిటల్ ఫ్లాట్​ఫామ్​

భారత్​లో కరోనా టీకా​ అభివృద్ధి చేస్తున్న సంస్థల వివరాలు, వ్యాక్సిన్​ నిల్వలను తెలుసుకునేందుకు ఎలక్ట్రానిక్​ వ్యాక్సిన్​ ఇంటెలిజెన్స్​ నెట్​వర్క్​(ఈ-విన్​ ) అనే డిజిటల్​ ప్లాట్​ఫామ్​​ని ఏర్పాటు చేయనుంది కేంద్రం. ఈ ఆన్​లైన్​ వేదిక ద్వారా వ్యాక్సిన్​ తయారీ, నిర్వహణ, రవాణా, సేకరణ నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చేంత వరకు వివిధ దశల్లోని సమాచారాన్ని తెలుసుకోవచ్చని అధికార వర్గాలు తెలిపాయి.

"ప్రస్తుత ప్రణాళిక ప్రకారం అన్నీ అనుకున్నట్లు జరిగితే కేంద్రం అంచనా మేరకు 2021 జులై నాటికి దేశంలో 20నుంచి 25కోట్లమందికి వ్యాక్సిన్​ అందజేస్తాం. ముందుగా ఏ వయస్సు వారికి వ్యాక్సిన్​ ఇవ్వనున్నారో రాష్ట్రాలు ఒక జాబితాను కేంద్రానికి అందజేయాలి."

---హర్షవర్ధన్​, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.