బంగాల్ రాష్ట్రంలోని పశ్చిమ మిద్నాపుర్ జిల్లా దాస్పుర్ ప్రాంతంలో ఓ నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవటం వల్ల ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.
భవనం పక్క నుంచి వెళుతున్న కాలువ పనులను అశాస్త్రీయంగా చేపడుతున్న కారణంగానే తమ ఇల్లు కూలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు ఇంటి యజమాని నిమాయ్ సమంత.