ఓనమ్ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు మలయాళీలు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ వేడుకలు చేసుకుంటున్నారు కేరళ వాసులు.



తిరువనంతపురం.. శ్రీ పద్మనాభస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకొని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రజలు.
వైరస్ వ్యాప్తి కారణంగా మూతబడిన ఆలయం భక్తుల కోసం ఆగస్టు 26న తిరిగి తెరుచుకుంది. కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు ఆలయ నిర్వహకులు.


కొచ్చి లోని వామనమూర్తి మందిరం, శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. వామనుడు, బలిచక్రవర్తి వేషంలో చిన్నారులు అలరించారు.




