దేశవ్యాప్తంగా నెలకొన్న లాక్డౌన్ కారణంగా ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించేందుకు ప్రముఖ పౌరాణిక గాథ 'రామాయణం' సీరియల్‌ను రీటెలికాస్ట్ చేయనుంది దూరదర్శన్. ప్రజలందరూ ఇళ్లకు పరిమితం కావడం వల్ల కొంత మంది రామానంద్ సాగర్ దర్శకత్వం వహించిన 'రామాయణం' సీరియల్ రీటెలికాస్ట్ చేయాలని సామాజిక మాధ్యమాల్లో కోరారు. ఈ నేపథ్యంలోనే ప్రజల కోరిక మేరకు రామాయణాన్ని దూరదర్శన్‌లో ప్రసారం చేయనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు.
"ప్రజల కోరిక మేరకు ఇలా ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. రేపటి నుంచి రామాయణం రీటెలికాస్ట్ కానుంది. మార్చి 28 శనివారం నుంచి దూరదర్శన్ ప్రసార మాధ్యమంలో ఒక ఎపిసోడ్‌ను ఉదయం 9 గంటల నుంచి 10 వరకు.. మరో ఎపిసోడ్‌ను సాయంత్రం 9 గంటల నుంచి 10 వరకు ప్రసారం చేయనున్నాం."
ప్రకాశ్ జావడేకర్, కేంద్ర మంత్రి
జావడేకర్ ట్వీట్ చేసిన అనంతరం ప్రసార భారతి సీఈఓ స్పందించి.. కేంద్ర మంత్రికి, సీరియల్ దర్శకుడు సాగర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల కోరికను నెరవేర్చేందుకు ఈ ధారావాహిక ప్రసారం కోసం డీడీ అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన పని చేసిందని పేర్కొన్నారు.
దూరదర్శన్‌లో తొలిసారి 1987లో రామాయణం ప్రసారమైంది. ఇందులో అరుణ్ గోవిల్ రాముడి పాత్ర పోషించగా.. దీపిక చిఖాలియా సీతగా నటించారు.