భారత వాయుసేన విశ్రాంత పైలట్ స్క్వాడ్రన్ లీడర్ దలీప్ సింగ్ మజితియా మంగళవారం వందో పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మజితియాకు ఎయిర్‌చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం స్వాతంత్య్రం సంపాదించిన 1947 ఆగస్టులో ఆయన రిటైర్ అయ్యారు. సుదీర్ఘ కాలం జీవించి ఉన్న భారత వాయుసేన విశ్రాంత పైలట్ మజితియానే కావడం గమనార్హం.
ఆయన పుట్టినరోజు సందర్భంగా భారత వాయుసేన తన ట్విట్టర్ హ్యాండిల్లో ప్రత్యేక వీడియో పోస్టు చేసింది. వాయుసేన యోధుల తరఫున మజితియాకు వాయుసేనాధిపతి మార్షల్ భదౌరియా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపినట్లు పేర్కొంది.
"100వ పుట్టినరోజు సందర్భంగా స్క్వాడ్రన్ లీడర్ దలీప్ సింగ్ మజితియాకు భారత వాయుసేన తరపున శుభాకాంక్షలు. ఆగస్టు 1947లో ఆయన రిటైర్ అయ్యారు. అత్యధిక వయసు కలిగి ఉన్న ఎయిర్‌ఫోర్స్ యుద్ధ విమాన పైలట్‌గా పేరుగాంచారు."
-భారత వాయు సేన ట్వీట్
-
Chief of the Air Staff Air Chief Marshal RKS Bhadauria conveyed warm greetings & heartiest congratulations to Sqn Ldr Dalip Singh Majithia (Retd) on his 100th birthday, on behalf of all Air warriors..
— Indian Air Force (@IAF_MCC) July 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
"Wishing you many more". pic.twitter.com/d2888G1iuu
">Chief of the Air Staff Air Chief Marshal RKS Bhadauria conveyed warm greetings & heartiest congratulations to Sqn Ldr Dalip Singh Majithia (Retd) on his 100th birthday, on behalf of all Air warriors..
— Indian Air Force (@IAF_MCC) July 27, 2020
"Wishing you many more". pic.twitter.com/d2888G1iuuChief of the Air Staff Air Chief Marshal RKS Bhadauria conveyed warm greetings & heartiest congratulations to Sqn Ldr Dalip Singh Majithia (Retd) on his 100th birthday, on behalf of all Air warriors..
— Indian Air Force (@IAF_MCC) July 27, 2020
"Wishing you many more". pic.twitter.com/d2888G1iuu
ఇదీ చదవండి- చైనా సరిహద్దుల్లో అమెరికా యుద్ధ విమానాలు