ETV Bharat / bharat

పొట్టకూటి కోసం బీడీలు చుడుతున్న జాతీయ క్రీడాకారిణిలు! - Odisha Sportspersons making bidi

ఒకప్పుడు ఫుట్​బాల్​ గ్రౌండ్​లో సత్తా చాటి.. రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచారు ఆ మహిళలు. కానీ, ఇప్పుడు బీడీలు చుడుతున్నారు.. వేరొకరి ఇంట్లో అంట్లు తోముతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం కరవై.. పొట్టకూటికోసం కోటి తిప్పలు పడుతున్నారు ఒడిశా సంబల్​పుర్​కు చెందిన జాతీయ స్థాయి​ క్రీడాకారిణిలు.

odisha national level sports persons live on making 'bidis' and cleaning dirty utensils at others' houses
పొట్టకూటికోసం బీడీలు చుడుతున్న జాతీయ క్రీడాకారిణిలు!
author img

By

Published : Mar 1, 2020, 11:08 AM IST

Updated : Mar 3, 2020, 1:12 AM IST

క్రీడాకారులు సొంత లాభం కోసం మైదానంలోకి దిగరు. తమ జట్టు, జిల్లా, రాష్ట్రం, దేశం గౌరవాన్ని పెంపొందించడమే వారి ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. ఒడిశా సంబల్​పుర్​కు చెందిన ఫుట్​బాల్​ క్రీడాకారిణిలు సైతం ఒకప్పుడు ఇలానే ఫుట్​బాల్ ఆటను ఆడేవారు. ఎన్నోసార్లు జాతీయ స్థాయిలో ఆ రాష్ట్రం పేరు నిలబెట్టారు. కానీ ఇప్పుడు వారి పరిస్థితి దయనీయంగా మారింది. బీడీలు చుడుతూ.. వేరొకరి ఇంట్లో అంట్లు తోముతూ బతుకుబండిని నెట్టుకొచ్చే దుస్థితి దాపరించింది.

పొట్టకూటి కోసం బీడీలు చుడుతున్న జాతీయ క్రీడాకారిణిలు!

అప్పుడలా.. ఇప్పుడిలా

1998లో ఫుట్​బాల్​ రంగంలోకి దిగిన డోలీ.. 2007లో టీమ్ కెప్టెన్​గా ఎంపికైంది. పదికి పైగా జాతీయ టోర్నమెంట్లలో పాల్గొని ఎన్నో పథకాలు సాధించింది. ఇప్పుడు పొట్టకూటి కోసం బీడీలు చుడుతోంది. సంబల్​పుర్​ మహిళా ఫుట్​బాల్​ టీమ్​ గోల్​కీపర్​గా వ్యవహరించిన మరో క్రీడాకారిణి మీనా మండాది, కోల్​కతా, అసోం, రోర్​కెలాలో గెలిచి ఒడిశా రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచిన దీప్తిది కూడా ఇదే పరిస్థితి.

వెనకబడిపోయారు..

ఢోలీ, దీప్తి, మీనాలే కాదు.. ఈ ఒక్క జిల్లాలోనే దాదాపు 18 మంది రాష్ట్ర స్థాయి క్రీడాకారిణిలదీ ఇదే దుస్థితి. ఒకప్పుడు వారు సాధించిన ఘనతకు రాష్ట్రమంతా ఉప్పొంగిపోయింది. కానీ, ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేక.. ప్రస్తుతం ఈ క్రీడాకరిణిలంతా వెనకబడిపోయారు.

క్రీడాకారుల శ్రేయస్సుకోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొచ్చినా.. వీరికి మాత్రం ఏ ఒక్కటీ అందలేదు. ఎన్నో సార్లు జిల్లా కలెక్టర్లను కలిసినా.. ప్రయోజనం దక్కలేదు. అంతే కాదు, ఓ సందర్భంలో స్థానిక ఎమ్మెల్యే జయనారయన్ మిశ్రా.. క్రీడాకారుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించారు.

కనీసం ఇప్పటికైనా.. ప్రభుత్వాలు కళ్లు తెరిచి ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించాలని కోరుతున్నారు ఈ ఫుట్​బాల్​ వనితలు.

ఇదీ చదవండి:ఒకే కాన్పులో ఆరుగురికి జన్మ..!

Last Updated : Mar 3, 2020, 1:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.