ETV Bharat / bharat

'ఏప్రిల్​ 30 వరకు లాక్​డౌన్​ కొనసాగింపు'

author img

By

Published : Apr 9, 2020, 1:34 PM IST

దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్​డౌన్​ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది ఒడిశా. ఏప్రిల్​ 30 వరకు కొనసాగించనున్నట్లు స్పష్టం చేసింది.

Odisha extends lockdown till Apr 30
ఏప్రిల్​ 30 వరకు లాక్​డౌన్​ కొనసాగింపు!

కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన దేశవ్యాప్త లాక్​డౌన్​ ఈనెల 14న ముగియనున్న నేపథ్యంలో ఒడిశా రాష్ట్ర కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న కేసులను అరికట్టేందుకు ఏప్రిల్​ 30 వరకు లాక్​డౌన్​ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. లాక్​డౌన్​ కొనసాగిస్తున్నట్లు ప్రకటించిన తొలి రాష్ట్రం ఒడిశానే కావటం గమనార్హం.

రాష్ట్ర మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించిన అనంతరం ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్ ఈ విషయం వెల్లడించారు.

"లాక్​డౌన్​ కాలాన్ని ఏప్రిల్​ 30 వరకు పొడిగించాలని నిర్ణయించాం. దేశవ్యాప్తంగా పొడిగించాలని కేంద్రాన్ని కోరాం. ఒడిశాకు రైళ్లు, విమానాలను ఈనెల 30 వరకు నడపొద్దని విన్నవించాం. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలు జూన్​ 17 వరకు మూసి ఉంటాయి. "

- నవీన్​ పట్నాయక్​, ముఖ్యమంత్రి

ఒడిశాలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 44కు చేరింది. మరికొందరు అనుమానితులు క్వారంటైన్​లో ఉన్నారు.

ఇదీ చూడండి: 'కరోనా వేళ జైలు గోడలే మాకు శ్రీరామ రక్ష'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.