భారత్... స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అణుసామర్థ్యం గల పృథ్వీ-2 క్షిపణిని గురువారం ఒడిశా తీరం నుంచి విజయవంతంగా పరీక్షించింది.
350 కి.మీ పరిధిలోని లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో చేధించగలదు ఈ క్షిపణి. 500/100 కిలోల వార్హెడ్లను మోసుకుపోయే సామర్థ్యం పృథ్వీ-2 సొంతం. ఇది లిక్విడ్ ప్రొపల్షన్ ట్విన్ ఇంజన్లతో పనిచేస్తుంది. అత్యాధునిక ఇంటిగ్రల్ గైడెన్స్ వ్యవస్థనూ కలిగి ఉంది.
సైన్యం అవసరాల కోసం ఈ క్షిపణిని వినియోగించనున్నారు. ఈ ప్రయోగ కార్యక్రమాలను సైన్యానికి చెందిన స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ (ఎస్ఎఫ్సీ) నిర్వహించింది.
ఇదీ చూడండి:- ఎదురులేని టీమిండియా.. విండీస్‌పై అలవోక విజయం