పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా నాగా స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఎన్ఎస్ఎఫ్) ఇవాళ 6 గంటలపాటు నాగాలాండ్‌లో బంద్ పాటిస్తున్నట్లు ప్రకటించింది. నాగా నిరోధిక ప్రాంతాల్లో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఈ బంద్ జరుగుతుందని స్పష్టం చేసింది.
ఈశాన్య రాష్ట్రాలు, నాగా ప్రజల ప్రయోజనాలకు, వారి మనోభావాలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన పౌరసత్వ చట్ట సవరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఎన్ఎస్ఎఫ్ ప్రకటించింది.
మణిపూర్, అసోం, నాగాలాండ్‌లో తమ అనుబంధ సంస్థలు బంద్‌ను నిర్వహిస్తాయని ఎన్ఎస్ఎఫ్ స్పష్టం చేసింది. అయితే ఈ బందు నుంచి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు, వివాహ శుభకార్యాలకు, వైద్యులకు, రోగులకు, మీడియా వారికి మినహాయింపు ఉంటుందని వెల్లడించింది.
సాధారణ జీవితం దెబ్బతింది..
క్యాబ్ వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో నాగాలాండ్ జనజీవనం స్తంభించింది. పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు.
ఇదీ చూడండి: 'పౌర' చట్ట నిరసనలు.. గువాహటిలో కర్ఫ్యూ తొలగింపు