ETV Bharat / bharat

భారత్​ భేరి: 3కోట్ల ఓట్లు ఎవరికీ పట్టవా? - voting

ప్రతి ఓటు విలువైనదే..! ఓటరు చైతన్యంలో భాగంగా ఎన్నికల సంఘం పదేపదే చెప్పే మాట ఇది. మరి మా ఓట్ల సంగతేంటని అంటున్నారు ప్రవాస భారతీయులు. వారివి ఏకంగా 3.10కోట్ల ఓట్లు. ప్రవాసీ ఓటర్లుగా పేరు నమోదు చేసుకునే వీలున్నా... పోలింగ్ రోజున తప్పనిసరిగా భారత్​ రావాలన్న నిబంధన వారికి ఇబ్బందికరంగా మారింది. ఈ సమస్యకు పరిష్కారం చూపలేమా?

ప్రవాస భారతీయ ఓటర్లు
author img

By

Published : Apr 6, 2019, 7:02 AM IST

3కోట్ల ఓట్లు ఎవరికీ పట్టవా?
సీన్​-1:

కెనడాలోని ఎడ్మంటన్​ నగరం.... మార్చి 31 ఉదయం 8 గంటలు.
ఎన్నికలు జరుగుతున్నాయి. అన్నా మాకీయెంకో, ఆమె భర్త, కుమార్తెతో కలిసి వచ్చి ఓటు వేసింది.
ఇక్కడొక ప్రత్యేకత ఉంది. అన్నా కుటుంబం స్వదేశం ఉక్రెయిన్. ఇక్కడ జరుగుతోంది ఉక్రెయిన్​ అధ్యక్ష ఎన్నికల పోలింగ్​.

కట్​ చేస్తే...

సీన్​-2:

అమెరికాలోని న్యూజెర్సీ​ నగరం.... ఏప్రిల్​ 6 ఉదయం 7 గంటలు.
ఆంధ్రప్రదేశ్​ పయనం అయ్యేందుకు సిద్ధమవుతున్నారు ప్రవాస భారతీయ వైద్యుడు గౌతమ్​​​. ఆయన రాకకు కారణం... ఏప్రిల్​ 11న జరిగే లోక్​సభ, శాసనసభ ఎన్నికలు.

ఎందుకిలా...?
'ఉక్రెయిన్'​ తూర్పు ఐరోపాలోని ఓ చిన్న దేశం. దేశ జనాభా 4.2 కోట్లు. మార్చి 31 అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. విదేశాల్లో ఉండే ఉక్రెనియన్లకు ఓటు హక్కు కల్పించింది ఆ దేశం. అది కూడా వారున్న చోటే. 72 దేశాల్లో ఉన్న ఉక్రెయిన్​ దౌత్య కార్యాలయాల్లో 101 పోలింగ్​ స్టేషన్లు ఏర్పాటు చేసింది. అందుకే... కెనడాలో ఉండే అన్నా లాంటి వారు ఓటు వేయగలిగారు. స్వదేశాధినేతను ఎన్నుకోవడంలో తమ వంతు పాత్ర పోషించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్​ విషయంలో మాత్రం అలా కుదరదు. ప్రవాస భారతీయులు ఎవరైనా సరే ఓటేయాలంటే ఇక్కడకు రావాల్సిందే. ఇదెంతో కష్టమైన పని. ఖర్చుతో కూడుకున్నది.

భారత్​లో ప్రస్తుతం ఇలా...

విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఇతర కారణాలతో విదేశాల్లో ఉంటున్న భారతీయుల సంఖ్య మూడు కోట్ల 10 లక్షలు. వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం స్పష్టమైన నిబంధనలు జారీ చేసింది. ఈసీ వెబ్​సైట్​లోని ఫామ్​-6ఏ ద్వారా ప్రవాస భారతీయులు తగు ఆధారాలతో దరఖాస్తు చేసుకొని ఓటు హక్కు పొందొచ్చు. ఎన్నికల సమయంలో మాత్రం ఇక్కడికి వచ్చి నిర్దేశిత ప్రాంతాల్లో ఓటు వేయాలి.

ఇందుకోసం 2010లో యూపీఏ ప్రభుత్వం ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించింది. అప్పుడు ప్రవాస భారతీయుల సంఖ్య 1.3 కోట్లు. వారిలో ఓటర్లుగా నమోదు చేసుకున్నవారు 71వేల మంది మాత్రమే.

ఎన్నారైలలో అసంతృప్తి....

ప్రస్తుత నిబంధనల ప్రకారం ఓవర్సీస్‌ ఎలక్టర్స్‌గా నమోదైనవారు పోలింగ్‌ కేంద్రానికి వచ్చి, పాస్‌పోర్ట్‌ చూపించి ఓటుహక్కు వినియోగించుకోవచ్చు. వీరికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశంతోపాటు సాధారణ ఓటరుకు ఉండే అన్ని హక్కులూ ఉంటాయి.

ప్రవాసీలు మాత్రం ఇక్కడకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవటంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్‌ తేదీన స్వదేశానికి రావడం కష్టంతో, ఖర్చుతో కూడుకున్నదని వారి వాదన. వారు నివసించే దేశాల్లోని రాయబార కార్యాలయాల్లో ఓటు వేసే ఏర్పాటు చేయాలని ఎన్నారైలు కోరుతున్నారు. గతంలోనే ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కమిటీ ఇది కుదిరే పనికాదని స్పష్టంచేసింది.

పరోక్ష ఓటింగ్​ కుదరదా..?

పోలింగ్​ కేంద్రానికి రాకుండా పోస్టల్​, ఈ-బ్యాలెట్​, ఆన్​లైన్, ఇతర పద్ధతుల ద్వారా ఓటు వేయడమే పరోక్ష ఓటింగ్​ విధానం. ఈ పద్ధతి అమలుపై కేంద్ర ప్రభుత్వం కొంత కసరత్తు చేసింది. ఎన్నారైల ఓటింగ్​ కోసం ప్రజాప్రాతినిధ్య చట్టం సవరణ బిల్లు- 2017ను కేంద్రమంత్రివర్గం ఆమోదించింది. ఈ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించినప్పటికీ రాజ్యసభలో వీగిపోయింది. ప్రాక్సీ ఓటింగ్‌ దుర్వినియోగం అయ్యే అవకాశాలున్నాయని విపక్షాలు అడ్డుకున్నాయి.
ఆన్‌లైన్‌ ఓటింగ్​పై చర్చలు జరుగుతున్నా... అమల్లోకి రాలేదు.

ఇంకెప్పటికి..?

సార్వత్రిక ఎన్నికల వేళ ప్రవాస భారతీయులకు ఓటు హక్కు మరోమారు ప్రాధాన్యం సంతరించుకుంది. వారు స్వదేశానికి రాకుండా ఉన్నచోటు నుంచే ఓటు వేయడంపై జరుగుతున్న చర్చ ఎప్పటికి కార్యరూపం దాల్చుతుందో వేచిచూడాలి.

ఇవీ చూడండి: కాషాయదళ 'కాకీ ఎన్నికల' వ్యూహం!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++AUDIO AS INCOMING++
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Dinard - 5 April 2019
1. British Foreign Secretary Jeremy Hunt entering news conference with human rights lawyer Amal Clooney and Canadian Foreign Minister Chrystia Freeland
2. SOUNDBITE (English) Jeremy Hunt, British Foreign Secretary:
SOUNDBITE (English)
"On the Brexit point, no one wants a long extension (of Article 50 period). I don't think the EU member states want a long extension, we certainly don't want a long extension, and that's why we are seeking to resolve this, and resolve this quickly. And the reality, the hard reality in a democracy, which points to your first question, is that we have a hung parliament and that means it's not possible for the government simply to decide what it wants to do, and do it. And that's why we are leaving no stone unturned in our search for a parliamentary majority so that we can do what people want in the UK,  which is to deliver Brexit smoothly and quickly, And in terms of your second point, be in no doubt the UK will continue to play a leading role championing democratic values around the world. That's what we've always done and that's what we always will do."
3. Cutaway
4. SOUNDBITE (English) Jeremy Hunt, British Foreign Secretary:
"The reality is that if you extend (Article 50 period) beyond April 12th, you are accepting there is a possibility of having to fight EP (European Parliament) elections. But if you were able to get the (EU) Withdrawal Agreement ratified before the 22 May then you might not actually have to fight them. There is zero appetite in the UK for fighting EP elections. Everyone wants this issue resolved so that we can get on and you can write stories about different things. So the objective through everything that we are doing is to try and create sufficient agreement in parliament, one way or another, to allow us not to fight EP elections. And, you know, the prime minister is absolutely determined to leave no stone unturned in that respect."
5. Cutaway
6. SOUNDBITE (English) Jeremy Hunt, British Foreign Secretary:
"The truth is, first of all, a no-deal outcome is bad for the UK. It's also very bad for the European Union. None of our economies are growing fast enough to guarantee that a no-deal scenario wouldn't push us into recession. So, it's a bad outcome all round. And I think the French understand that, the Germans understand that and what we are looking for is to avoid a long extension (of Article 50 period) to resolve this. And what we will say to the European Council meeting on Wednesday is that we are doing everything we can, and we will give them an honest assessment as to whether we think that process will bear fruit. But what I think they will see from the actions that Theresa May has taken over the last week is that she is leaving no stone unturned to do that. So, Britain is not dragging its feet in trying to solve this, but we are a democracy with a hung parliament so it's not easy, but we are doing everything we can to resolve this and that's what the British people want."
7. Journalist
8. News conference ends
STORYLINE:
British Foreign Secretary Jeremy Hunt said Friday the UK has "zero appetite" for European Parliament elections.
He was speaking on the sidelines of a G7 Foreign Ministers meeting in Dinard, in France.
UK Prime Minister Theresa May has requested a delay in Brexit until June 30 to allow more time for an orderly departure from the European Union.
But that would mean taking part in European Parliament elections next month.
Hunt said that no one wants a lengthy delay to Brexit, and that May is "leaving no stone unturned" to break the impasse
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.