కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకునేందుకు రాహుల్‌గాంధీ పట్టుబడుతున్న నేపథ్యంలో సీనియర్ నేత వీరప్ప మొయిలీ కీలక వ్యాఖ్యలు చేశారు. పదవి నుంచి తప్పుకునే అంశమై ఒక్కశాతం కూడా రాహుల్ వెనక్కి తగ్గే అవకాశాలు కనిపించడం లేదని పీటీఐ వార్తా సంస్థతో చెప్పారు.
రాహుల్ పదవి నుంచి తప్పుకునే అంశంలో ఏదైనా జరగొచ్చు అని తెలిపారు మొయిలీ. ఈ అంశమై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాహుల్ రాజీనామాను సీడబ్ల్యూసీ ఆమోదించేవరకు ఊహాగానాలు కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు.
అధ్యక్షురాలిగా ప్రియాంక బాధ్యతలు చేపడతారన్న ప్రచారాన్ని మొయిలీ కొట్టిపారేశారు. ఈ విషయమై సీడబ్ల్యూసీ అడుగు వేసే వరకు వేచి చూడాల్సిందేనని వెల్లడించారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్‌కు పెద్ద ఆపరేషన్ అవసరమని ఇటీవల వ్యాఖ్యానించారు మొయిలీ.
సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు రాహుల్ గాంధీ. పలు దఫాలుగా సీనియర్ నేతలు నచ్చజెప్పినప్పటికీ బాధ్యతల నుంచి తప్పుకునేందుకే రాహుల్ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.
ఇదీ చూడండి: నక్సలైట్ల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి