ETV Bharat / bharat

భాజపాతో పోల్చితే శివసేన నయం: శరద్ పవార్​

శివసేనతో కూటమిగా జట్టుకట్టడం భాజపాతో కలిసినంత క్లిష్టతరం కాదని వ్యాఖ్యానించారు ఎన్సీపీ అధినేత శరద్​పవార్​. కాంగ్రెస్​తో చర్చలు సాగిన తీరు పట్ల అసంతృప్తితోనే అజిత్​ పవార్ తొలుత​ భాజపాకు మద్దతిచ్చారని.. ఆ తర్వాత విరమించుకున్నారని తెలిపారు.

Pawar
శరద్ పవార్​
author img

By

Published : Dec 4, 2019, 5:06 AM IST

Updated : Dec 4, 2019, 10:47 AM IST

భాజపాతో పోల్చితే శివసేన నయం: శరద్ పవార్​

మహారాష్ట్రలో శివసేన కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషించిన ఎన్సీపీ అధినేత శరద్​ పవార్​ మరో ఆసక్తికర విషయం తెలిపారు. అజిత్​ పవార్​తో దేవేంద్ర ఫడణవీస్ సంప్రదింపులు జరిపిన విషయం తనకు తెలుసని వెల్లడించారు. కాంగ్రెస్​తో చర్చలు సాగిన తీరు పట్ల అసంతృప్తితోనే తొలుత భాజపాతో ప్రభుత్వ ఏర్పాటుకు అజిత్ మద్దతిచ్చారని శరద్ పవార్ చెప్పారు.

భాజపాతో జట్టుకట్టడం కంటే శివసేనతో కూటమిగా ఏర్పడటమే మేలని వ్యాఖ్యానించారు పవార్​. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయినప్పుడు ఇదే విషయాన్ని చెప్పానన్నారు. భాజపాకు ఎన్సీపీ మద్దతు సాధ్యం కాదని స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేనలకు ఒకరి సిద్ధాంతాల పట్ల మరొకరికి పూర్తి అవగాహన ఉందన్నారు శరద్ పవార్​. మరో ఐదేళ్ల పాటు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ముందే తెలుసు..

మహారాష్ట్రలో భాజపా ప్రభుత్వ ఏర్పాటు సమయంలో అజిత్​ పవార్​తో దేవేంద్ర ఫడణవీస్ సంప్రదింపులు జరిపిన విషయం తనకు తెలుసని.. అజిత్ అలాంటి నిర్ణయం తీసుకుంటారని తాను ఊహించలేదని చెప్పారు పవార్​. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తన నిర్ణయం సరికాదని తెలుసుకుని మరునాడే తన వద్దకు వచ్చి డిప్యూటీ సీఎం పదవికి అజిత్​ రాజీనామా చేసినట్లు చెప్పారు​.

ఇదీ చూడండి: 'భారత్​ మ్యాప్​' మళ్లీ మార్చేందుకు పార్లమెంట్ ఆమోదం

AP Video Delivery Log - 1800 GMT Horizons
Tuesday, 3 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1215: HZ Italy Venice Scuba AP Clients Only 4242883
From straw hats to scuba helmets, gondoliers clean canals
AP-APTN-0951: HZ Greenland Glacier AP Clients Only 4242422
New research: Greenland ice sheet is fracturing, becoming unstable
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Dec 4, 2019, 10:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.