" ఈ రోజు ఎలాంటి దాడులు లేకపోవటం వల్ల సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఏ ప్రాంతంలోనూ నిషేదాజ్ఞలు విధించలేదు. ఉదయం నుంచి ప్రజారవాణా ప్రారంభమవటం వల్ల దుకాణాలు, పెట్రోల్ పంపులు, ఇతర వ్యాపార సముదాయాలు తిరిగి తెరుచుకున్నాయి."
-పోలీసు అధికారి, కశ్మీర్
పుల్వామా జిల్లా త్రాల్ ప్రాంతంలో ఆల్‌ఖైదా అనుబంధ సంస్థ అన్సార్ ఘజ్వాత్ ఉల్ హింద్ ఉగ్రసంస్థ అధినేత జాకిర్ మూసాను శుక్రవారం మట్టుబెట్టాయి బలగాలు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని ముందు జాగ్రత్తతో కర్ఫ్యూ విధించారు. శనివారం సైతం కర్ఫ్యూను కొనసాగించారు. అంతర్జాల సేవలను నిలిపేశారు.
ఇదీ చూడండి: కాటేదాన్ ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్నిప్రమాదం