ETV Bharat / bharat

అవినీతి ఉద్యోగులకు ఇకనుంచి పాస్​పోర్టు​ కట్​​!

author img

By

Published : Mar 6, 2020, 6:07 PM IST

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న లేదా సస్పెన్షన్​కు గురైన ప్రభుత్వ ఉద్యోగులకు ఇక నుంచి పాస్​పోర్టు లభించదు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విజిలెన్స్​ కమిషన్, విదేశీ వ్యవహారాల శాఖతో సంప్రదింపులు జరిపి ప్రస్తుత నిబంధనలను సవరించింది.

No passport for corrupt babus: Govt
అవినీతి ఉద్యోగులకు ఇకనుంచి పాస్​పోర్టు​ కట్​​!

అవినీతి పరులకు పాస్​పోర్టు జారీ చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్​లో ఉన్న లేదా అవినీతి ఆరోపణల కేసులతో సంబంధమున్న ప్రభుత్వ ఉద్యోగులకు పాస్​పోర్టు ఇవ్వకూడదని సిబ్బంది వ్యవహారాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. విదేశీ వ్యవహారాల శాఖ, సెంట్రల్​ విజిలెన్స్​ కమిషన్​తో సంప్రదింపులు జరిపిన అనంతరం ప్రస్తుత నిబంధనలకు మార్పులు చేసింది.

ఇక నుంచి పాస్​పోర్టు కావాలనుకునే ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి విజిలెన్స్​ క్లియరెన్స్​ తప్పనిసరి. ఒకవేళ ఉద్యోగిపై ఏమైనా నేరారోపణలు ఉంటే పాస్​పోర్టు జారీని నిలిపివేసే అధికారం విజిలెన్స్​ కమిషన్​కు ఉంటుందని ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. అవినీతి నిరోదక చట్టం కింద కేసు నమోదైన ఉద్యోగులకూ పాస్​పోర్టు అనుమతి నిరాకరించొచ్చు.

పాస్​పోర్టు మంజూరు చేసే సమయంలో పాస్​పోర్ట్​ యాక్ట్​,1967లోని 6(2) నిబంధన ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా వర్తిస్తుందో లేదో చూసుకోవాలని అన్ని శాఖలను ఆదేశించింది కేంద్రం.

ఇదీ చూడండి: 'ఈనాడు'కు మరో గౌరవం- ఉత్తమ వార్తా పత్రికగా చాణక్య పురస్కారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.