పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న వేళ...కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పలు సూచనలు జారీ చేసింది. హింసాత్మక ఘటనలు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరింది.
హింసను ప్రోత్సహించే తప్పుడు వార్తలు, వదంతులు సోషల్ మీడియాలో వ్యాప్తి కాకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. శాంతి భద్రతలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలని సూచించింది.
నిరసనలు భగ్గుమంటున్న తరుణంలో.. పౌరసత్వ చట్ట సవరణపై మరోమారు స్పష్టతనిచ్చింది హోంశాఖ. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్తాన్ నుంచి వచ్చే వలసదారులు భారత పౌరసత్వం అంత సులభంగా పొందలేరని స్పష్టం చేసింది. హిందూ సహా మిగతా ఐదు వర్గాలకు చెందిన అక్రమ వలసదారులు అవసరమైన ప్రమాణాలను నెరవేర్చిన తర్వాతే వారు పౌరసత్వం పొందగలరని తెలిపింది.
ఇదీ చదవండి: ఛాతీలోకి ఇనుప కడ్డీ దూసుకెళ్లినా.. బతికిపోయాడు!