ETV Bharat / bharat

'రష్యా టీకా మూడో దశ ట్రయల్స్​పై నిర్ణయం తీసుకోలేదు'

రష్యా కొవిడ్ వ్యాక్సిన్.. స్పుత్నిక్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్​ను భారత్​లో నిర్వహించే విషయంపై తుది నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్.. సామాజిక మాధ్యమంలో ప్రకటించారు.

author img

By

Published : Oct 4, 2020, 10:43 PM IST

No final decision taken on Sputnik V phase-3 trials yet
భారత్​లో రష్యా వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్​పై ఆరోగ్య శాఖ స్పష్టత

రష్యా రూపొందించిన కరోనా టీకా 'స్పుత్నిక్-వీ' మూడో దశ ట్రయల్స్​ను భారత్​లో నిర్వహించే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​ ఆదివారం స్పష్టం చేశారు. 'సండే సంవాద్'లో భాగంగా సామాజిక మాధ్యమంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

రష్యా తయారు చేసిన కొవిడ్‌-19 టీకా 'స్పుత్నిక్‌-వీ'పై మనదేశంలో మూడో దశ క్లినికల్‌ పరీక్షలు నిర్వహించటానికి ఒప్పందం కుదుర్చుకున్న డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌.. డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతి కోరుతూ దరఖాస్తు చేసిన నేపథ్యంలో హర్షవర్ధన్ ఈ ప్రకటన చేశారు.

ఇదీ చూడండి:స్పుత్నిక్ ట్రయల్స్​పై మరింత సమచారం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.