శబరిమల ఆలయంలోకి భక్తులకు నో ఎంట్రీ - Sabarimala temple for 10-day annual fest
మార్చి 29నుంచి జరిగే శబరిమల ఆలయ వార్షికోత్సవానికి భక్తులకు అనుమతి లేదని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిషేధం 10 రోజుల పాటు కొనసాగుతుందని స్పష్టం చేసింది. అదేవిధంగా త్రిశూర్ నగరంలోని ప్రముఖ కృష్ణాలయం దర్శనాన్ని కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కేరళలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు ఆంక్షలు విధించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా మార్చి 29 నుంచి జరిగే శబరిమల ఆలయ వార్షికోత్సవ వేడుకలకు భక్తులను అనుమతించబోమని స్పష్టం చేసింది.
దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో జిల్లా పాలనాధికారి, జిల్లా విపత్తు నిర్వహణ విభాగ ఛైర్మన్‌తో చర్చించి శబరిమలలో భక్తుల ప్రవేశంపై నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు ఆలయ బోర్డు వెల్లడించింది.
మార్చి 28 నుంచి ఏప్రిల్ 7 వరకు 10 రోజుల పాటు శబరిమల వార్షిక వేడుకలను నిర్వహించనున్నారు ఆలయ అధికారులు.
కృష్ణా ఆలయం కూడా..
త్రిశూర్ నగరంలోని ప్రముఖ కృష్ణాలయంలోకి భక్తుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఎప్పటిలాగే పూజా కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయని తెలిపారు.
కాశీ ఆలయం సైతం..
ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రముఖ శైవ క్షేత్రమైన కాశీ ఆలయాన్ని కూడా మూసి వేస్తున్నట్లు ఆ రాష్ట్ర అధికారులు ప్రకటించారు.
ఇదీ చూడండి:బాలీవుడ్ గాయనితో పార్లమెంట్‌కు కరోనా సెగ
TAGGED:
Sabarimala temple