సాగు చట్టాలపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. అటు కేంద్రం, ఇటు రైతులు తమ పట్టుదలను వీడటం లేదు. నిపుణుల కమిటీ సాగు చట్టాలపై నివేదిక ఇచ్చే వరకు ఏడాదిన్నర పాటు నూతన వ్యవసాయ చట్టాల అమలును నిలిపి వేస్తామని 10 వ దఫా చర్చల్లో కేంద్రం ప్రతిపాదించగా.. చర్చల్లో పురోగతి లభించినట్లే అనిపించింది. అయితే అలాంటి ప్రతిపాదనను అంగీకరించేది లేదని సంయుక్త కిసాన్ మోర్చా స్పష్టం చేసింది. సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని పునరుద్ఘాటించింది.
సాగు చట్టాల్ని రద్దు చేసి, మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించే వరకు కేంద్రం చేసే ఎలాంటి ప్రతిపాదనను అంగీకరించే ప్రసక్తేలేదు. మా డిమాండ్లని ఎప్పుడో స్పష్టంగా చెప్పాం. సాగు చట్టాల్ని రద్దు చేయాల్సిందే అప్పటి వరకు తమ ఆందోళన కొనసాగిస్తాం.
-జోగిందర్ ఎస్ ఉగ్రాన్, రైతు సంఘం నేత
ఇదీ చూడండి: సాగు చట్టాలపై దిగొచ్చిన కేంద్రం