కేంద్రపాలిత ప్రాంతమైన దిల్లీకి రాష్ట్ర హోదా కల్పించాలని బిహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్(యూ) అధినేత నితీశ్ కుమార్ డిమాండ్ చేశారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించిన నితీశ్.. బిహార్‌కి ప్రత్యేక హోదా కల్పించాలని మరోసారి డిమాండ్ చేశారు.
దిల్లీకి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టాలని నితీశ్ భావిస్తున్నారు. ప్రస్తుతం జేడీయూ, భాజపా మిత్రపక్షమైనప్పటికీ, పొత్తు కేవలం బిహార్ వరకే పరిమితమని నితీశ్ ఇది వరకే స్పష్టం చేశారు. ముఖ్యంగా బిహార్, పూర్వాంచల్ నుంచి దిల్లీకి వలస వెళ్లిన ఓటర్ల పైనే నితీశ్ ఆశలు పెట్టుకున్నారు.
అందులో భాగంగానే 'హోదా' డిమాండ్ అందుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా దిల్లీకి రాష్ట్ర హోదా కోసం ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది.
ఇదీ చూడండి:దిల్లీ పీఠం కోసం 'కాలనీ'లపై కేంద్రం కన్ను