అధికారంలోకి వస్తే 'న్యాయ్' ద్వారా పేదలకు ఏటా 72 వేల రూపాయలు జీవన భృతిగా ఇస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మే 25 ప్రకటించారు. అదే రోజు పథకంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు రాజీవ్ కుమార్.
"ఎన్నికల్లో గెలిచేందుకు 1971లో గరిబీ హఠావో నినాదం, 2008లో ఒకే హోదా- ఒకే పింఛను పథకం, 2013లో ఆహార భద్రతతో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది. కానీ వాటిని అమలు చేయటంలో విఫలమైంది. అదే తీరుగా కనీస ఆదాయ హామీ కూడా అవకాశవాద హామీగానే ఉంటుంది."
-రాజీవ్ కుమార్, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్
వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని మే 27న రాజీవ్‌కు నోటీసులు జారీ చేసింది ఈసీ. ఆయన సమాధానంపై ఈసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోసారి ఇలాంటి చర్యలు ఆమోదించబోమని హెచ్చరించింది.
"ప్రభుత్వ అధికారిగా ఉంటూ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడటం తగదు. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలులేదు. ఎన్నికల విధానంలో ఓటర్లలో అనుమానాలు రేకెత్తేలా వ్యాఖ్యానించకూడదు. వ్యవహార శైలిలోనే కాకుండా వ్యాఖ్యలు, ప్రకటనల్లోనూ పారదర్శకంగా ఉండాలి. అదే ఈ విషయంలో లోపించింది.
మీరు చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని కమిషన్ తీర్మానించింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రకటనలు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి."
- నరేంద్ర బుటోలియా, ఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ
ఇదీ చూడండి: మోదీ ప్రసంగంపై నివేదిక కోరిన ఈసీ