ETV Bharat / bharat

రేపు తేలనున్న నిర్భయ దోషుల భవితవ్యం..! - జాతీయ వార్తలు తెలుగు

నిర్భయ దోషుల ఉరి శిక్ష అమలు... రోజుకో మలుపు తిరుగుతోంది. దోషుల న్యాయపరమైన అవకాశాలు పెండింగ్​లో ఉన్న నేపథ్యంలో శిక్ష అమలుపై సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో నలుగురు దోషులు దాఖలు చేసిన పిటిషన్​పై దిల్లీ కోర్టుకు రేపు తిహార్​ జైలు అధికారులు ఇవ్వనున్న నివేదికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

nirbhaya-case
nirbhaya-case
author img

By

Published : Jan 30, 2020, 7:40 PM IST

Updated : Feb 28, 2020, 1:47 PM IST

దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషుల మరణ దండనకు ఆదేశాలు వచ్చినా అమలుపై ఇంకా సందిగ్ధం నెలకొంది. ఓవైపు శనివారం ఉరి శిక్ష అమలు చేసేందుకు తిహార్​ జైల్లో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మరోవైపు మరణ దండనను ఆలస్యం చేసేందుకు దోషులు న్యాయపరమైన అవకాశాలను ఉపయోగించుకుంటున్నారు.

దోషుల్లో ఒకరైన ముకేశ్​ కుమార్​ క్షమాభిక్ష పిటిషన్​ కారణంగా ఇప్పటికే జనవరి 22న అమలు కావాల్సిన శిక్ష.. ఫిబ్రవరి 1కి వాయిదా పడింది. ప్రస్తుతం మరో దోషి వినయ్​ కుమార్​ తాజాగా రాష్ట్రపతికి క్షమాభిక్ష అర్జీ పెట్టుకున్నాడు. మూడో దోషి అక్షయ్‌ ఠాకూర్‌ దాఖలు చేసిన క్యురేటివ్​ పిటిషన్‌ను న్యాయస్థానం ఇవాళ కొట్టివేసినా అతనికి ఇంకా న్యాయపరమైన అవకాశాలు ఉన్నాయి. మరో దోషి పవన్​ గుప్తాకు క్యురేటివ్​ పిటిషన్ ​దాఖలు చేసేందుకు అవకాశముంది.

తిహార్​ జైలుకు కోర్టు నోటీసులు

ఇదే కారణంతో మరణ శిక్ష అమలుపై నిరవధికంగా స్టే విధించాలని నలుగురు దోషులు.. దిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం విచారణకు రాగా.. ప్రభుత్వ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్​... న్యాయ వ్యవస్థను అపహాస్యం చేసేలా, శిక్షను ఆలస్యం చేసే ఎత్తుగడలా ఉందని వాదించారు.

వాదనలు ఆలకించిన జడ్జి... తిహార్ జైలు అధికారులకు నోటీసులు జారీ చేశారు. దోషుల అభ్యర్థనపై శుక్రవారం ఉదయం 10 గంటలలోపు తమ అభిప్రాయం చెప్పాలని ఆదేశించారు.

ఆలస్యమవుతుందా?

అంతేకాకుండా వినయ్​ కుమార్​ క్షమాభిక్ష పిటిషన్​ను రాష్ట్రపతి ఒకవేళ తిరస్కరించినా.. దోషికి మరో 14 రోజుల సమయం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో తిహార్​ జైలు అధికారులు శుక్రవారం అందించే నివేదికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అధికారుల వివరణను అనుసరించి కోర్టు ఆదేశాలు ఇవ్వనుంది.

ముమ్మర ఏర్పాట్లు..

మరోవైపు తిహార్​ జైల్లో దోషులను శనివారం ఉరితీసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. తలారిగా ఎంపికైన పవన్​ జల్లాడ్​ ఈ రోజు తిహార్​ జైలులో రిపోర్టు చేశాడు. రేపు ఉరి శిక్షకు సంబంధించి ట్రయల్స్​ చేయనున్నాడు.

ZCZC
PRI GEN LGL NAT
.NEWDELHI LGD37
LDALL NIRBHAYA
Nirbhaya case: Convicts move court for stay on execution, SC rejects third curative plea
         New Delhi, Jan 30 (PTI) Death-row convicts in the Nirbhaya case on Thursday took another step, which may delay their scheduled February 1 hanging, by moving a trial court with a plea to adjourn the execution "sine die" saying they are yet to avail their remaining legal remedies even as the Supreme Court dismissed the third curative petition.
         Of the four convicts, Mukesh Kumar Singh has exhausted all his legal remedies, including the clemency plea which was dismissed by President Ram Nath Kovind on January 17 and the appeal against the rejection was thrown out by the apex court on Wednesday.
         Convict Vinay Kumar Sharma had yesterday filed a mercy plea before the President and the apex court today rejected the curative petition of Akshay Kumar Singh, who is likely to file a clemency plea soon.
         Pawan Gupta is yet to file a curative petition in the top court.
         The day witnessed fast-paced development with the counsel for Vinay, Akshay and Pawan rushing to a trial court seeking stay on their executions saying legal remedies of some of them are yet to be availed.
         While Special Judge A K Jain posted the matter for hearing in the post-lunch session, a five-judge bench of the apex court in the afternoon rejected the curative plea of Akshay saying "no case is made out" and also declined to stay his execution.
         Hours after the apex court development, the trial judge issued notice to Tihar jail authorities seeking their response on the plea by three convicts, which the prosecution said was a "mockery of justice" and was only a "delaying tactic".
         While all eyes would be in the trial court on Friday when the matter would be taken up for hearing at 10 AM, the reports have already appeared that Pawan Jallad, a hangman from Meerut Prison has reached Tihar Jail two days ahead of the scheduled execution.
         According to Delhi Prison Rules, none of the four convicts in the same case can be hanged before the last one has exhausted all legal options including the mercy plea.                            
         The apex court guidelines also stipulate that convicts cannot be hanged until 14 days after their mercy plea has been rejected by the President.
         The trial court on January 17 had issued black warrants for the second time for execution of all the four convicts -- Mukesh (32), Pawan (25), Vinay (26) and Akshay (31) -- in Tihar jail at 6 am on February 1.
         The court had earlier on January 7 fixed January 22 as the hanging date.
          The 23-year-old physiotherapy intern, who came to be known as 'Nirbhaya', the fearless one, was gang-raped and savagely assaulted on the night of December 16, 2012, in a moving bus in south Delhi. She died of her injuries a fortnight later in a Singapore hospital.
          One of the six accused in the case, Ram Singh, allegedly committed suicide in Tihar Jail in 2013.
          A juvenile, who was among the accused, was convicted by a juvenile justice board and was released from a reformation home after serving a three-year term. PTI UK PKS ABA MNL SJK RKS
SA
01301909
NNNN
Last Updated : Feb 28, 2020, 1:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.