పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ బీచ్హౌస్ను పేల్చివేశారు మహారాష్ట్ర రాయగడ్ జిల్లా అధికారులు. అలీబాగ్ కిహిమ్ బీచ్‌లోని 'రూపణ్య' భవంతిని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని ఆరోపణలున్నాయి.
సరిహద్దుల్లో భవన నిబంధనలను ఉల్లంఘించి నిర్మించినందున భవంతిని కూల్చాలనిరాయ్గఢ్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఆర్సీసీ పిల్లర్ల సాయంతో కట్టిన భారీ నిర్మాణం కావటం వల్ల బాంబులతో పేల్చి వేయాలని అధికారులు నిర్ణయించారు.
ఈ బంగ్లాను పీఎన్బీ కేసులో ఈడీ జప్తు చేసింది. అందులోని విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నాక కలెక్టర్ కార్యాలయానికి ఈ ఏడాది జనవరి 24న అప్పగించింది.
ఇదీ చూడండి:అయోధ్యపై మధ్యవర్తిత్వం