అండమాన్-నికోబార్ దీవులను వరుస భూకంపాలు వణికించాయి. కేవలం రెండు గంటల వ్యవధిలో 9 సార్లు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 4.7 నుంచి 5.2 తీవ్రతతో ఈ భూకంపాలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అధికారులు తెలిపారు.
ఉదయం 5.14 గంటలకు మొదటిసారిగా 4.9 తీవ్రతతో భూమి కంపించింది. అనంతరం పలుమార్లు భూకంపాలు వచ్చాయి. వీటి తీవ్రత రిక్టర్ స్కేలుపై 5 గా నమోదయ్యాయి. చివరి భూకంపం 6.40 గంటలకు 5.2 తీవ్రతతో వచ్చిందని అధికారులు తెలిపారు. ఇవన్నీ మధ్యస్థాయి తీవ్రత కలిగిన భూకంపాలు కావడం వల్ల ప్రమాదం తప్పింది.
అండమాన్-నికోబార్ ద్వీపసమూహంలో భూకంపాలు సంభవించడం మరీ అరుదేమీ కాదు. రోజూ కనీసం మూడు సార్లు అయినా భూమి కంపిస్తుంటుంది.
ఇదీ చూడండి:మన హెలికాప్టర్ మనోళ్లే కూల్చేశారు!