దేశవ్యాప్తంగా నదులు, చెరువుల సంరక్షణకు ఎలాంటి ప్రణాళికలు లేనందున జాతీయ హరిత ట్రైబ్యునల్ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఒక నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 2021 జనవరి 31లోపు నోడల్ ఏజెన్సీ అధికారులు సమావేశం కావాలని నిర్దేశించింది. నీటి సంరక్షణపై ప్రణాళిక రూపొందించాలని సూచించింది.
గురుగ్రామ్‌లోని ఘటా సరస్సును పునరుద్ధరించాలంటూ మాజీ లెఫ్టినెంట్ కల్నల్ సర్వధామన్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఎన్జీటీ ఈ నిర్ణయం తీసుకుంది.