ETV Bharat / bharat

'జామియా దృశ్యాలను మానవ హక్కుల సంఘానికి పంపిస్తాం'

పౌర చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన విద్యార్థులపై పోలీసులు దాడి చేసినట్లు జామియా ఇస్లామియా విశ్వవిద్యాలయం విద్యార్థుల సమన్వయ సంఘం ఓ వీడియోను విడుదల చేసింది. పారా మిలిటరీ దళాలు, పోలీసు సిబ్బంది లాఠీలతో కొడుతున్నట్లు అందులో ఉంది. ఈ దృశ్యాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

New videos of Jamia incident
జామియా విద్యార్థులపై దాడి వీడియో దృశ్యాల విడుదల
author img

By

Published : Feb 17, 2020, 6:44 AM IST

Updated : Mar 1, 2020, 2:12 PM IST

పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమించిన విద్యార్థులపై పోలీసులు ఇటీవల క్రూరంగా విరుచుకుపడ్డారంటూ జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయ (జేఎంఐ) విద్యార్థుల సమన్వయ సంఘం ఆదివారం ఓ వీడియో దృశ్యాన్ని విడుదల చేసింది. దీనిని జాతీయ మానవ హక్కుల సంఘానికి పంపిస్తామని తెలిపింది. గత ఏడాది డిసెంబర్​ 15న జరిగిన ఘటనలో విశ్వవిద్యాలయ గ్రంథాలయంలోపల విద్యార్థుల్ని పారా మిలిటరీ దళాలు, పోలీసు సిబ్బంది లాఠీలతో కొడుతున్నట్లుగా ఈ 48 సెకెన్ల వీడియోలో ఉంది. కొడుతున్నవారు తమ ముఖాలకు చేతి రుమాళ్లను అడ్డుగా పెట్టుకున్నారు.

జామియా విద్యార్థులపై దాడి వీడియో దృశ్యాల విడుదల

మరో రెండు..

తొలి వీడియో బయటకు వచ్చిన కొన్ని గంటల తర్వాత మరో రెండు వీడియోలు వెలుగు చూశాయి. ముఖాలకు ముసుగులు ధరించిన కొందరు యువకులు విశ్వవిద్యాలయం ప్రాంగణంలోకి వస్తున్నట్లు ఒక వీడియోలో ఉంది. వారు పోలీసుల కంట పడకుండా మరికొందరు అడ్డుగా నిల్చొన్నట్లు నమోదైంది. గ్రంథాలయ ప్రధాన తలుపులకు అడ్డంగా టేబుళ్లు, కుర్చీలు పడవేస్తూ ఇంకొందరు కనిపించారు. అది ఎప్పుడు జరిగిందనే వివరాలు మాత్రం వీడియోపై లేవు. ముఖానికి ముసుగులు, చేతుల్లో రాళ్లతో కొందరు ఉన్నట్లు మూడో వీడియోలో నమోదైంది.

అమిత్​ షా అబద్ధం చెప్పారు..

జేఎంఐ విద్యార్థుల్ని పోలీసులు, కొట్టలేదంటూ కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, దిల్లీ పోలీసులు అబద్ధాలు చెప్పినట్లు తాజా వీడియోతో రుజువైందని కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు.

ఇదీ చూడండి: కేజ్రీవాల్ మీకు అభినందనలు: మోదీ

Last Updated : Mar 1, 2020, 2:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.