కేరళ రాష్ట్రంలో 'ప్లాస్మోడియం ఓవల్' అనే కొత్త రకం మలేరియాను గుర్తించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి కేకే శైలజ తెలిపారు. ఈ వ్యాధి సుడాన్ నుంచి వచ్చిన ఓ జవాను సోకినట్లు గుర్తించామని చెప్పారు. ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
-
Plasmodium ovale, a new genus of malaria, has been detected in the State. It was found in a soldier who was being treated at the District hospital in Kannur. The soldier had come from Sudan. The spread of the disease can be avoided with timely treatment and preventive measures.
— Shailaja Teacher (@shailajateacher) December 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Plasmodium ovale, a new genus of malaria, has been detected in the State. It was found in a soldier who was being treated at the District hospital in Kannur. The soldier had come from Sudan. The spread of the disease can be avoided with timely treatment and preventive measures.
— Shailaja Teacher (@shailajateacher) December 10, 2020Plasmodium ovale, a new genus of malaria, has been detected in the State. It was found in a soldier who was being treated at the District hospital in Kannur. The soldier had come from Sudan. The spread of the disease can be avoided with timely treatment and preventive measures.
— Shailaja Teacher (@shailajateacher) December 10, 2020
" రాష్ట్రంలో కొత్త రకం మలేరియా ప్లాస్మోడియం ఓవల్ను గుర్తించాం. కన్నూర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ జవాను శరీరంలో ఈ వ్యాధి ఉన్నట్లు తేలింది. అతను సుడాన్ నుంచి వచ్చాడు. సరైన సమయంలో చికిత్స అందించటం, నివారణ చర్యలు చేపట్టటం వల్ల ఈ వ్యాధి వ్యాప్తిని అడ్డుకోగలిగాం. "
- కేకే శైలజ, కేరళ ఆరోగ్య శాఖ మంత్రి
భారత్లో కరోనా వైరస్ తొలి కేసు కూడా కేరళలోనే వెలుగుచూసింది. త్రిస్సూర్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి వూహాన్ నుంచి వచ్చిన క్రమంలో అతనికి వైరస్ సోకినట్లు గుర్తించారు. అలాగే.. 2018లో కోజికోడ్ జిల్లాలో నిఫా వైరస్ వ్యాప్తి చెందింది. ఈ నేపథ్యంలో కొత్త రకం మలేరియాపై ప్రజల్లో ఆందోళన నెలకొంది.
ఇదీ చూడండి: రోగనిరోధక శక్తిని తగ్గించే అలవాట్లు ఇవే!