దేశ విద్యావ్యవస్థలో సమూల మార్పులు చేస్తూ.. కేంద్రం తీసుకువచ్చిన నూతన విద్యా విధానంలో అమెరికా విద్యావ్యవస్థ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందన్నారు హైదరాబాద్లోని నల్సార్ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఫైజాన్ ముస్తాఫా. నూతన విద్యా విధానంపై హర్షం వ్యక్తం చేసిన ఆయన.. దానికి చట్టబద్ధత కూడా అవసరమన్నారు.
'ఈటీవీ భారత్' ప్రత్యేక ఇంటర్వ్యూలో నూతన విద్యా విధానంపై అనేక అంశాలను పంచుకున్నారు ముస్తాఫా.
అమెరికా తరహా స్వేచ్ఛ కావాలి..
అమెరికా, బ్రిటన్లతో పోలిస్తే.. మన దేశంలో ఉన్నత విద్యలో నియంత్రణ ఎక్కువగా ఉన్నట్లు ముస్తాఫా తెలిపారు. అక్కడ కళాశాలలకు డిగ్రీలు ప్రధానం చేసే అధికారులు ఉంటాయని చెప్పుకొచ్చారు.
'కేంద్రం తెచ్చిన కొత్త విద్యా విధానం... సరళత్వం ఉండాలని చెబుతున్నా నియంత్రణలూ తప్పనిసరని పేర్కొంటుంది. అలాంటప్పుడు కళాశాలలకు, యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తి ఇచ్చి ప్రయోజనం ఉండదని' అంటున్నారు. ఇందుకోసం అమెరికా తరహా స్వయం ప్రతిపత్తిని మన యూనివర్సిటీలకు, కళాశాలలకు కల్పించాలని ముస్తాఫా సూచించారు.
- నూతన విద్యావిధానంపై ఫైజాన్ ముస్తాఫా వ్యక్తం చేసిన అభిప్రాయాలు, సూచనలు ఆయన మాటల్లోనే..