ETV Bharat / bharat

రోడ్డు పక్కన నీటి పైపుల్లో నవజాత శిశువు - కర్ణాటక వార్తలు

మానవత్వం మరిచిన ఓ తల్లి అప్పుడే పుట్టిన తన బిడ్డను రోడ్డు పక్కన నీటి పైపుల్లో పడేసిన సంఘటన కర్ణాటక బెల్గాం జిల్లాలో జరిగింది. చిన్నారి ఏడుపు విన్న సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది కాపాడారు.

New born baby found in water pipe
నీటి పైపుల్లో నవజాత శిశువు
author img

By

Published : Oct 7, 2020, 1:03 PM IST

అమ్మతనానికే మచ్చ తెచ్చే సంఘటన కర్ణాటక బెల్గాం జిల్లాలో జరిగింది. తన పొత్తిళ్లల్లో సురక్షితంగా ఉండాల్సిన నవజాత శిశువును రోడ్డు పక్కన కొత్తగా ఏర్పాటు చేస్తున్న నీటి పైపుల్లో పడేసి వెళ్లింది ఓ కర్కశ తల్లి. అది గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సమీపంలో జరగటం గమనార్హం.

చచాడీ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ఓ శిశువు అరుపులు విని ఆశా కార్యకర్తలు, అంగన్​వాడీ సిబ్బంది వెతికారు. రోడ్డు పక్కన కొత్తగా నిర్మిస్తున్న మంచి నీటి పైపుల్లో అప్పుడే పుట్టిన శిశువును గుర్తించి కాపాడారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చిన్నారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు వైద్యులు. ప్రస్తుతం గ్రామస్థులే.. ఆ శిశువు బాధ్యతలను చూస్తున్నారు.

ముర్గోదా ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీ చేశారు. శిశువును ఇక్కడ పడేసింది ఎవరు, కారణాలేంటనే అంశంలో దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.

ఇదీ చూడండి: ఆ మంటతో తంటాలుపడక ముందే జాగ్రత్తపడదాం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.