ETV Bharat / bharat

జాతీయ విద్యా విధానంపై సమావేశంలో మోదీ ప్రసంగం

author img

By

Published : Aug 7, 2020, 5:30 AM IST

'జాతీయ విద్యా విధానంలో ఉన్నత విద్య సంస్కరణల' అంశంపై ఏర్పాటు చేయనున్న సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. సమావేశ ప్రారంభోత్సవంలో భాగంగా ప్రసంగించనున్నారు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన నూతన విద్యా విధానంపై సమావేశంలో విస్తృత చర్చలు జరగనున్నాయి.

NEP 2020: PM to deliver inaugural address on Higher Education policy
జాతీయ విద్యా విధానంపై సమావేశంలో మోదీ ప్రసంగం

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ సంయుక్తంగా నిర్వహించనున్న కాంక్లెవ్​లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. 'జాతీయ విద్యా విధానంలో భాగంగా ఉన్నత విద్యలో పరివర్తన, సంస్కరణల' అంశంపై మోదీ ప్రసంగించనున్నారు.

కాంక్లేవ్​లో భాగంగా కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానానికి సంబంధించి ప్రత్యేక చర్చలు జరగనున్నాయి. మల్టీడిసిప్లినరీ, ఫ్యూచరిస్టిక్ విద్య, నాణ్యమైన పరిశోధనలో మెరుగైన ఫలితాల కోసం సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడంపై నిపుణులు తమ అభిప్రాయాలు పంచుకోనున్నారు.

మంత్రుల నుంచి ప్లిన్సిపల్స్​ వరకు..

మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్, కేంద్ర సహాయ మంత్రి సంజయ్ ధోత్రే ఈ సమావేశానికి హాజరుకానున్నారు. జాతీయ విద్యా విధానం ముసాయిదా రూపొందించిన కమిటీ ఛైర్మన్, సభ్యులతో పాటు ప్రముఖ విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు కార్యక్రమంలో పాల్గొననున్నారు. విద్యా విధానానికి సంబంధించి వివిధ అంశాలపై మాట్లాడనున్నారు. విశ్వవిద్యాలయ ఉపకులపతులు, విద్యా సంస్థల డైరెక్టర్లు, ప్రిన్సిపల్స్​ తదితరులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కానున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.