కరోనా కారణంగా నీట్ పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులకు మరో అవకాశం కల్పించనున్నట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీకోర్టుకు తెలిపారు. అక్టోబర్ 14న నీట్ పరీక్ష నిర్వహించి, 16న ఫలితాలు వెల్లడించనున్నట్లు వెల్లడించారు. సొలిసిటర్ జనరల్ ఇచ్చిన సమాచారాన్ని ఆదేశాల్లో పొందుపరుస్తున్నట్లు సుప్రీం వెల్లడించింది.
కరోనా బారినపడి లేదా కంటైన్మెంట్ జోన్లలో చిక్కుకొని గత పరీక్ష రాయలేకపోయిన పలువురు విద్యార్థులు ఈ నిర్ణయంతో లాభపడనున్నారు.
సెప్టెంబర్లో నిర్వహించిన పరీక్షకు 15.97 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా... 85-90 శాతం మంది హాజరయ్యారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) గతంలో తెలిపింది.
ఇదీ చూడండి: వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నీట్