ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా 23 లక్షల మంది క్వారంటైన్​లో - 23 lakh people in quarantine centers across india

మే 26 నాటికి దేశవ్యాప్తంగా 23 లక్షల మంది క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. మే 14 నాటికి 11 లక్షల 95 వేల మంది క్వారంటైన్లో ఉండగా..12 రోజుల్లోనే ఆ సంఖ్య దాదాపు రెట్టింపైనట్లు పేర్కొంది.

Nearly 23 lakh people in quarantine across India: Govt estimates
దేశవ్యాప్తంగా 23 లక్షల మంది క్వారంటైన్​
author img

By

Published : May 28, 2020, 8:22 PM IST

దేశవ్యాప్తంగా 23 లక్షల మంది క్వారంటైన్‌లో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. నాలుగో విడత లాక్‌డౌన్‌ సమయంలో విదేశాల నుంచి వచ్చినవారితో పాటు దేశంలోపలే ప్రయాణించిన వారిని సైతం క్వారంటైన్ కేంద్రాలకు తరలించినట్లు తెలిపింది. మే 26 నాటికి మొత్తంగా 22లక్షల 81 వేలమందిని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేసిన క్వారంటైన్​ కేంద్రాల్లో ఉంచినట్లు వివరించింది.

మే 14 నాటికి 11 లక్షల 95 వేల మంది క్వారంటైన్ కేంద్రాలలో ఉండగా..12 రోజుల్లోనే ఆ సంఖ్య దాదాపు రెట్టింపైనట్లు పేర్కొంది. మే 26 నాటికి మహారాష్ట్రలో 6లక్షల 2 వేల మంది, గుజరాత్‌లో 4లక్షల 42 వేల మంది క్వారంటైన్ కేంద్రాలలో ఉన్నట్లు కేంద్రం తెలిపింది. ఉత్తర్​ప్రదేశ్​లో 3లక్షల 6 వేల మంది, బిహార్‌లో 2.1 లక్షల మంది, ఛత్తీస్‌గఢ్‌లో 1.86 లక్షలు, ఆంధ్రప్రదేశ్​లో 14 వేల 930 మంది క్వారంటైన్‌లో ఉన్నట్లు పేర్కొంది.

ఇతర ప్రాంతాల నుంచి తమ రాష్ట్రాల్లోకి వచ్చేవారిని కనీసం ఏడు రోజుల పాటు క్వారంటైన్​లో ఉంచుతున్నాయి ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు. ఇదివరకు 14రోజులుగా ఉన్న క్వారంటైన్ కాలాన్ని ఇప్పుడు 7 రోజులకు కుదించారు.

లాక్​డౌన్ సమయంలో ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న 91 లక్షల మంది వలస కార్మికుల్ని సొంత రాష్ట్రాలకు తరలించినట్లు తెలిపింది కేంద్రం. వారందరినీ ఆయా రాష్ట్రాల్లో క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచినట్లు స్పష్టం చేసింది. వందే భారత్ మిషన్ ద్వారా ఇప్పటి వరకు 40 దేశాల్లోని 30వేల మంది భారతీయులను స్వదేశం తీసుకువచ్చినట్లు వివరించింది. మొత్తం 60 దేశాల నుంచి లక్ష మందిని తీసుకురావాలని ప్రణాళికలు రూపొందించినట్ల వివరించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.