బిహార్లో మళ్లీ జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)దే అధికారమని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ ధీమా వ్యక్తం చేశారు. బిహార్ శాసనసభ ఎన్నికల్లో సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ 220 స్థానాలకు గెలుచుకోవటం ఖాయమని జోస్యం చెప్పారు.
బిహార్ ఎన్నికలపై భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో జరిగిన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు నిత్యానంద రాయ్. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనులే తమకు విజయాన్ని అందిస్తాయన్నారు రాయ్.
పరిశ్రమలకు ఊతం..
ఈ ఎన్నికల్లో కరోనా సంక్షోభంలో నిరుపేదలకు అందించిన సాయం, అయోధ్య రామాలయం నిర్మాణ ప్రారంభం వంటివి ముఖ్యమైన అంశాలుగా ఉంటాయన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ, మత్స్య, పశుసంవర్ధక రంగాల్లో అనేక పరిశ్రమలను ప్రారంభించనున్నట్లు తెలిపారు రాయ్.
బిహార్ ఎన్నికలు..
బిహార్లోని 243 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్- నవంబర్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే పోలింగ్ తేదీలను ఇంతవరకు వెల్లడించలేదు ఎన్నికల సంఘం. నవంబర్ 29న ఎన్నికలు ముగిస్తామని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: 'బిహార్లో అధికారం మళ్లీ ఎన్డీఏదే'