బిహార్ ఎన్నికల్లో జమల్పుర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఎన్సీపీ నేత ఇంద్రదేవ్ దాస్‌కు చేదు అనుభవం ఎదురైంది. మంగళవారం వెల్లడించిన ఫలితాల్లో ఆయనకు కేవలం రెండు ఓట్లు మాత్రమే లభించాయి. అయితే.. తన కుటుంబంలో 18మంది ఉండగా.. రెండు ఓట్లే ఎలా పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు దాస్. ఎన్నికల నిర్వహణలో పొరపాటు జరిగిందని ఆరోపించారు. ఈవీఎంల ట్యాపింగ్ కూడా జరిగిందని అన్నారు.
పంజాబ్ అభ్యర్థికీ.."నా కుటుంబంలో 18మంది ఓటర్లు ఉన్నారు. అక్టోబర్ 28న అందరూ బూత్ నంబర్ 177 దగ్గరే ఓటు వేశారు. ఆర్థికంగా, ఎన్నికల ర్యాలీలో నాకు సహాయం చేసింది నా కుటుంబమే. అలాంటిది, కేవలం రెండు ఓట్లే రావడం అనేది అసాధ్యం."
-ఇంద్రదేవ్ దాస్, ఎన్సీపీ నేత.
గతంలో.. పంజాబ్‌లోని జలందర్ నియోజవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన నీతూ శత్తర్న్ వాలాకూ కేవలం ఐదు ఓట్లే వచ్చాయి. అయితే ఆయన కుటుంబసభ్యులు 9 మంది ఉన్నారు. వారందరూ తనను మోసం చేశారని కన్నీరుపెట్టుకున్నారు నీతూ.