ఛత్తీస్గఢ్లో నక్సల్స్ పేట్రేగిపోతున్నారు. దంతెవాడలోని ఎస్సార్ ఇనుప గని సమీపంలో దుశ్చర్యకు పాల్పడ్డారు. రహదారి పనుల కోసం వినియోగిస్తున్న వాహనాలను రోడ్డు వెంబడి నిలిపిఉన్న సమయంలో నిప్పటించారు. ఈ ఘటనలో 3 ట్రక్కులు, ఓ పొక్లయినర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి ఆలస్యంగా చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.
సుమారు 50 మంది నక్సల్స్ ఈ కాల్చివేత ఘటనలో పాల్గొన్నారని తెలిపారు పోలీసు అధికారులు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇటీవల మహారాష్ట్ర అవతరణ దినోత్సవం నాడూ నక్సలైట్లు ఘాతుకానికి ఒడిగట్టారు. గడ్చిరోలి జిల్లాలో పోలీసులు ప్రయాణిస్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఐఈడీ పేల్చారు. 15 మంది పోలీసు జవాన్లు, ఓ డైవరును బలిగొన్నారు. అంతకుముందు రాత్రి గడ్చిరోలిలో రహదారి నిర్మాణ సంస్థకు చెందిన 27 వాహనాలకు నిప్పుబెట్టారు నక్సలైట్లు.
ఇదీ చూడండి: 'దేశవ్యాప్త గుర్తింపుతో బిజీ అయిపోయా'