గుజరాత్ నవ్సారీ జిల్లాలో ప్రముఖ జానపద గాయని గీతా రబారీ పాటకు భారీ నోట్ల వర్షం కురిసింది.
చిస్లీ తాలూకా వన్జనా గ్రామంలో మెలడీ మాత ఆలయంలో గీతా రబారీ కార్యక్రమం ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో గీత పాడుతున్నంతసేపు నోట్ల వర్షం కురిపించారు భక్తులు. భారీ సంఖ్యలో పాల్గొన్న అభిమానులు 10 రూపాయల నుంచి 2000 రూపాయల భారతీయ నోట్లతో పాటు బోలెడన్ని 10 డాలర్ల అమెరికా నగదు గీతపై విరజిమ్మారు.
జానపద గాయనిపై కురిసిన నోట్ల మొత్తం సుమారు 8 నుంచి 10 లక్షల రూపాయలు ఉంటాయని అంచనా వేస్తున్నారు నిర్వాహకులు. అయితే ఆ డబ్బంతా మెలడీ మాత ఆలయానికే సమర్పిస్తానని తెలిపారు గీతా.
'కార్యక్రమంలో 10 రూపాయల నుంచి 2వేల రూపాయల నోట్లతోపాటు, భారీగా అమెరికా డాలర్లు కూడా వర్షంలా పడ్డాయి. నాపై కురిపించిన ఈ డబ్బంతా ఇక్కడి మెలడీ అమ్మవారికే అంకితం. గుజరాత్లో నా కార్యక్రమం ఉన్న ప్రతి చోట ఇలాగే నోట్ల వర్షం కురిపిస్తారు. ఆ నగదు మొత్తం ఏదో ఓ మంచి కార్యానికే కేటాయిస్తా. పేదలకు సాయం చేస్తా'
-గీతా రబారీ, ప్రముఖ గాయని
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన గీత.. ఆయన సూచనల మేరకు స్వచ్ఛ్భారత్కు తనవంతు కృషి చేస్తున్నారు. తన కార్యక్రమానికి భారీ సంఖ్యలో విచ్చేసే అభిమానులకు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కలిగిస్తూ.. ఉచితంగా వస్త్ర సంచులను పంచుతున్నారు.
ఇదీ చదవండి:ప్రధాని మోదీని మెప్పించిన గుజరాతీ గాయని