సీఏఏ నిరసనల్లో హింస చెలరేగిన ఈశాన్య దిల్లీలోని మౌజ్‌పుర్ ప్రాంతంలో పరిస్థితిని ప్రత్యక్షంగా సమీక్షించారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉన్నట్లు చెప్పారు. శాంతియుత వాతావరణం నెలకొందని తెలిపారు. స్థానిక ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, అధికారులు తమ విధులను బాధ్యాతాయుతంగా నిర్వర్విస్తున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు డోభాల్.
ఈశాన్య దిల్లీలోని వేర్వేరు ప్రాంతాల స్థానికులతో స్వయంగా మాట్లాడారు డోభాల్. "ప్రేమ భావంతో మెలగండి. మనందరిదీ ఒకే దేశం. మనందరం కలిసి బతకాలి. దేశాన్ని కలిసి అభివృద్ధి చేసుకోవాలి" అని ఓ మహిళతో అన్నారు.
-
#WATCH Delhi: National Security Advisor (NSA) Ajit Doval interacts with the local residents of #NortheastDelhi. While speaking to a woman resident he says, "Prem ki bhaavna bana kar rakhiye. Hamara ek desh hai, hum sab ko milkar rehna hai. Desh ko mil kar aage badhana hai." pic.twitter.com/Y1tyAz2LXQ
— ANI (@ANI) February 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH Delhi: National Security Advisor (NSA) Ajit Doval interacts with the local residents of #NortheastDelhi. While speaking to a woman resident he says, "Prem ki bhaavna bana kar rakhiye. Hamara ek desh hai, hum sab ko milkar rehna hai. Desh ko mil kar aage badhana hai." pic.twitter.com/Y1tyAz2LXQ
— ANI (@ANI) February 26, 2020#WATCH Delhi: National Security Advisor (NSA) Ajit Doval interacts with the local residents of #NortheastDelhi. While speaking to a woman resident he says, "Prem ki bhaavna bana kar rakhiye. Hamara ek desh hai, hum sab ko milkar rehna hai. Desh ko mil kar aage badhana hai." pic.twitter.com/Y1tyAz2LXQ
— ANI (@ANI) February 26, 2020
దిల్లీ అల్లర్లను అదుపులోకి తెచ్చే బాధ్యతను డోభాల్‌కు అప్పగించింది కేంద్రప్రభుత్వం. గత రాత్రి నుంచి ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తూ... పోలీసులు, అధికారులకు తగిన ఆదేశాలు ఇస్తున్నారు.