మహారాష్ట్ర నాగ్‌పుర్‌కు చెందిన నిఖిల్ మంకర్ అనే ప్రొఫెసర్... ముట్టుకోకుండా గుడిలో గంటను కొట్టేలా సరికొత్త ఆవిష్కరణ చేశారు. దీని వల్ల వైరస్ సోకే ప్రమాదం తగ్గుతుందని తెలిపారు.
ఈ గంటను సెన్సార్ టెక్నాలజీతో రూపొందించారు నిఖిల్. సెన్సార్ కింద చేయి పెడితే గంట మోగే విధంగా రూపొందించినట్లు తెలిపారు. దీన్ని తయారు చేయడానికి రూ.250 ఖర్చు అయినట్లు చెప్పారు.
అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా సడలింపుల వల్ల దేశవ్యాప్తంగా దేవాలయాలు తెరుచుకునే అవకాశముంది. మరోవైపు దేశంలో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులకు కరోనా సోకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు నిఖిల్.
నాగ్‌పుర్ జిల్లాలో శవనెర్లోని ఆదర్శ విద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు నిఖిల్ మంకర్. గతంలోనూ 150 రూపాయల ఖర్చుతో.. హ్యాండ్ శానిటైజర్ మిషన్‌ను తయారు చేసినట్లు ఆయన వెల్లడించారు.
ఇదీ చూడండి: టాపర్లకు కార్లు బహుమతిగా ఇచ్చిన మంత్రి