భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)గా గిరీశ్ చంద్ర ముర్ము బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు.
ముర్మును సీఏజీగా నియమిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఆగస్టు 6న అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటివరకు సీఏజీగా ఉన్న రాజీవ్ మెహర్షి శుక్రవారం పదవీ విరమణ చేశారు.
ఎల్జీగా రాజీనామా
జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా బుధవారం సాయంత్రం ముర్ము రాజీనామా చేశారు. దీంతో ఆయన నూతన కాగ్గా నియమితులవుతారని అప్పుడే ఊహాగానాలు వినిపించాయి.
ఇదీ చూడండి: జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ రాజీనామా- కారణమిదే!