గుజరాత్లో 12 ఏళ్ల బధిర బాలికపై వరుసకు సోదరుడయ్యే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అత్యంత కిరాతకంగా బాలిక ప్రాణాలు తీశాడు. బనాస్కాంఠా జిల్లాలోని డీసాలో ఈ ఘటన జరిగింది.
బాలికను శుక్రవారం అపహరించి తీసుకెళ్లాడు నిందితుడు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తల, మొండెం వేరై ఉన్న బాలిక మృతదేహాన్ని దంతివాడా తాలుకా వద్ద గుర్తించారు.
సీసీటీవీ ఫుటేజీ సహా ఇతర సమాచారం ఆధారంగా నిందితుడిని గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు. డీసాలోనే నివాసం ఉండే నితిన్ మాలిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఘటనా స్థలిలో మరిన్ని ఆధారాలను సేకరిస్తున్నారు. అత్యాచారం విషయం ఎవరికీ తెలియకూడదని నితిన్.. బాలిక గొంతు కోసి చంపాడని పోలీసులు వెల్లడించారు.
![Murder after Rape of a 12-year-old deaf and dumb girl by cousin in Banaskantha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-bns-04-hatya-gj10014_18102020160153_1810f_1603017113_21_1810newsroom_1603034930_1057.jpg)