ETV Bharat / bharat

36 గంటలైనా ముంబయి మాల్​లో ఆరని మంటలు - ముంబయిలో అగ్ని ప్రమాదం

ముంబయిలోని సిటీ సెంటర్​ మాల్​ అగ్ని ప్రమాదంలో మంటలు అదుపు చేసే ఆపరేషన్​ ఇంకా కొనసాగుతోంది. 18 అగ్నిమాపక యంత్రాలు, 10 జంబో ట్యాంకులతో 36 గంటలుగా శ్రమిస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. ఘటనా స్థలాన్ని సందర్శించారు రాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే.

Mumbai mall blaze
సిటీ సెంటర్​ మాల్​ అగ్ని ప్రమాదం
author img

By

Published : Oct 24, 2020, 10:37 AM IST

మహారాష్ట్ర ముంబయి మహానగరంలోని సిటీ సెంటర్​ మాల్​ అగ్ని ప్రమాదంలో మంటలు అదుపు చేసే చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం రాత్రి 8.53 గంటల ప్రాంతంలో భవనం రెండో అంతస్తులో మంటలు చెలరేగగా.. 36 గంటలుగా మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. 18 అగ్నిమాపక యంత్రాలు, 10 జంబో ట్యాంకుల సాయంతో ఆపరేషన్​ కొనసాగిస్తున్నట్లు చెప్పారు అధికారులు.

Mumbai mall blaze
కొనసాగుతున్న ఆపరేషన్​

"ఈ ప్రమాదంలో స్థానికులు గాయపడినట్లు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. జ్వాలలను అదుపు చేస్తున్న క్రమంలో ఐదుగురు అగ్నిమాపక సిబ్బంది, ఓ అధికారికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వారంతా ఆరోగ్యంగా ఉన్నారు. చికిత్స తీసుకుని డిశ్చార్జి అయ్యారు."

- అగ్నిమాపక అధికారులు

అగ్ని ప్రమాదం జరిగిన తొలుత.. లెవల్​-1గా ప్రకటించినప్పుటికీ.. మంటలు వేగంగా విస్తరించటం వల్ల రాత్రి 10.45 గంటలకు లెవల్​-3గా, ఆ తర్వాత మరుసటి రోజు తెల్లవారు జామున 2.30 గంటలకు లెవల్​ 4 ప్రమాదంగా గుర్తించారు. ప్రస్తుతం దీనిని లెవల్​ 5 ప్రమాదంగా పేర్కొన్నారు అధికారులు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పక్క భవనాల్లోని 3,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఘటనా స్థలాన్ని మహారాష్ట్ర పర్యటక శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే సందర్శించి.. అగ్నిమాపక ఆపరేషన్​ను పర్యవేక్షించారు.

Mumbai mall blaze
ఘటనా స్థలంలో ఆదిత్య ఠాక్రే

ఇదీ చూడండి: ముంబయి సిటీ సెంటర్​ మాల్​లో అగ్నిప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.