మధ్యప్రదేశ్ మంత్రి ఇమర్తి దేవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్రంలోని శివ్పురీ జిల్లా కరెరాలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు భోజనాన్ని శౌచాలయంలో వండుతున్నారని ఫిర్యాదు అందింది.
ఈ విషయంపై దేవి స్పందించారు. టాయ్లెట్లో వంట చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. శౌచాలయం వినియోగంలో లేదని.. వంట చేసేందుకు అందులో చోటు ఉందని చెప్పుకొచ్చారు.
ప్రస్తుత కాలంలో మన ఇళ్లలో కూడా వంటగది పక్కనే శౌచాలయాలు ఉంటున్నాయని.. అంతమాత్రన ఇంటికొచ్చిన బంధువులు భోజనం చేయకుండా వెళ్తే మనమేం చేస్తాం అన్నారు దేవి. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.
ఇదీ చూడండి: కుక్క ప్రేమ వర్సెస్ యజమాని పరువు..!