మధ్యప్రదేశ్ రాజకీయం సుప్రీంకోర్టుకు చేరింది. తక్షణమే శాసనసభలో బలపరీక్ష నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది భాజపా. విశ్వాస పరీక్ష గురించి ప్రస్తావించకుండా అసెంబ్లీని స్పీకర్ ఈ నెల 26 వరకు వాయిదా వేసిన నేపథ్యంలో ఈమేరకు దాఖలు చేసింది కమలదళం.
సుప్రీంకోర్టుకు చేరిన మధ్యప్రదేశ్ రాజకీయం
12:39 March 16
11:40 March 16
ఎటూ తేలకుండానే వాయిదా..
-
Madhya Pradesh Assembly adjourned till 26th March https://t.co/vPqkvM9QHi
— ANI (@ANI) March 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Madhya Pradesh Assembly adjourned till 26th March https://t.co/vPqkvM9QHi
— ANI (@ANI) March 16, 2020Madhya Pradesh Assembly adjourned till 26th March https://t.co/vPqkvM9QHi
— ANI (@ANI) March 16, 2020
మధ్యప్రదేశ్ శాసనసభ సమావేశాలను మార్చి 26కు వాయిదా వేశారు స్పీకర్. గవర్నర్ లాల్జీ టాండన్ ప్రసంగాన్ని ఒక్క నిమిషంలోనే పూర్తి చేసి సభ నుంచి వెనుదిరిగారు. అనంతరం కాసేపటికే సభ వాయిదాపడింది. దీంతో కమల్‌నాథ్ ప్రభుత్వం బలపరీక్ష అంశం ఎటూ తేలలేదు.
10:54 March 16
శాసనసభ వద్దకు కాంగ్రెస్, భాజపా ఎమ్మెల్యేలు
మధ్యప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రత్యేక బస్సులో శాసనసభ ప్రాంగణానికి చేరుకున్నారు. అదే సమయంలో భాజపా శాసనసభ్యులు కూడా అసెంబ్లీ వద్దకు వచ్చారు. ఈ నేపథ్యంలో గవర్నర్ లాల్జీ టాండన్‌కు లేఖ రాశారు సీఎం కమల్‌నాథ్. ఈ విశ్వాస పరీక్ష అనవసరమని లేఖలో పేర్కొన్నారు. బందీలుగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా బలపరీక్షలో పాల్గొంటేనే విశ్వాస పరీక్ష సరైన విధానంలో సాగినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు.
08:20 March 16
మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం రసకందాయంలో పడింది. కమల్‌నాథ్ సర్కార్ బల పరీక్షపై సందిగ్ధత నెలకొంది. మరి విశ్వాస పరీక్షే జరిగితే... అధికార పీఠాన్ని కాంగ్రెస్ నిలుపుకోనుందా? విశ్వాసపరీక్షలో బలం నిరూపించుకోలేక అధికారాన్ని భాజపాకు చేజార్చుకుంటుందా అనేది నేటితో తేలిపోతుంది. నేటి నుంచి ఏప్రిల్ 13 వరకు మధ్యప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. తొలి రోజు తన ప్రసంగం పూర్తి అయిన వెంటనే విశ్వాస పరీక్ష ఉంటుందని గవర్నర్ లాల్జీ టాండన్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే విశ్వాసపరీక్ష నిర్వహించాలా వద్దా అన్న దానిపై సోమవారమే నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ ఎన్పీ ప్రజాపతి ప్రకటించిన కారణంగా ఈ అంశమై ఉత్కంఠ మరింత పెరిగింది.
అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భాజపాలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 22 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల్లో ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామాలను శనివారం ఆమోదించారు స్పీకర్ ప్రజాపతి. తాజా నిర్ణయంతో.. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 222కు పడిపోయింది. కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని నిలుపుకోవాలంటే 112 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుత ప్రభుత్వానికి.. కాంగ్రెస్ 108, నలుగురు స్వతంత్రులు, ఇద్దరు బీఎస్పీ, ఒక ఎస్పీ ఎమ్మెల్యేలతో కలిపి 114 మంది బలం ఉంది.
అయితే బెంగళూరులోని ఓ రిసార్ట్‌లో ఉన్న 22 మంది ఎమ్మెల్యేల్లో కొందరు భాజపాలో చేరేందుకు సుముఖంగా లేరనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు బహిరంగంగానే ప్రకటించారు. తిరిగి పార్టీలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. అయితే.. తాజాగా ఆరుగురి రాజీనామాలను స్పీకర్ ఆమోదించగా.. మిగతా 16 మంది రాజీనామాలపై ఉత్కంఠ నెలకొంది. 22 మంది రెబల్ ఎమ్మెల్యేల్లో మిగతా 16 మంది రాజీనామాలు ఆమోదిస్తే.. అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 206కు పడిపోతుంది. ప్రభుత్వానికి కావాల్సిన మెజారిటీ 104కు చేరుతుంది. కాంగ్రెస్ బలం 92కు చేరుకోవటం వల్ల మెజారిటీకి 5 సీట్ల దూరంలో నిలిచిపోతుంది అధికార కూటమి. దీంతో భాజపాకు ఉన్న 107 స్థానాలతో అధికారం పీఠం దక్కించుకుంటుంది