'సల్మాన్ ఖాన్ ఇండోర్లోనే జన్మించారు. అతని బాల్యమంతా ఇక్కడే గడిచింది. ఆయన తాతగారు ఇక్కడే సీనియర్ పోలీసు అధికారిగా విధులు నిర్వర్తించారు. సల్మాన్ ప్రచారం చేస్తే ఇండోర్లో కాంగ్రెస్ పార్టీ రూపు రేఖలు పూర్తిగా మారిపోతాయి'
- పంకజ్ చతుర్వేది, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి
అయితే... ఈ విషయంపై స్పందించేందుకు సల్మాన్ ఖాన్ ప్రతినిధి నిరాకరించారు.
భాజపా కంచుకోట
మధ్యప్రదేశ్లో అతిపెద్ద పట్ణణమైన ఇండోర్ భాజపా కంచుకోట. 1989లో జరిగిన ఎన్నికల్లో అప్పటి సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ సీఎం ప్రకాశ్ చంద్రపై భాజపా నేత సుమిత్రా మహాజన్ ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి ఈ స్థానంలో భాజపా తరఫున ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఎనిమిది సార్లు ఎంపీగా గెలుపొందిన సుమిత్రా మహాజన్ ప్రస్తుతం లోక్సభ స్పీకర్గా వ్యహరిస్తున్నారు.
గతంలో ఫలించని సల్మాన్ ప్రచారం
2009లో ఇండోర్ మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పంకజ్ సంఘవికి మద్దతుగా సల్మాన్ రోడ్ షో నిర్వహించారు. ఫలితంగా కాంగ్రెస్కు చేదు అనుభవమే మిగిలింది. భాజపా అభ్యర్థే గెలుపొందారు.